Sudheer : మాస్ హీరోగా మారుతున్న సుధీర్.. యాక్షన్‌తో అదరగొట్టిన ‘గాలోడు’

సుధీర్. జబర్దస్త్ లో ఫేమ్ రావడంతో సుధీర్ కి వేరే షోలతో పాటు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఒక పక్క టీవీ షోలు, వేరే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరో పక్క హీరోగానూ....

Sudheer :   జబర్దస్త్ షోలో టీం కంటెస్టెంట్ గా వచ్చి టీం లీడర్ గా ఎదిగి తన కష్టంతో, తన ట్యాలెంట్ తో బుల్లితెర స్టార్ గా మారి ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నాడు సుధీర్. జబర్దస్త్ లో ఫేమ్ రావడంతో సుధీర్ కి వేరే షోలతో పాటు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఒక పక్క టీవీ షోలు, వేరే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరో పక్క హీరోగానూ సినిమాలు ట్రై చేస్తున్నాడు సుధీర్.

వెండితెరపై కూడా తన క్రేజ్ ని చూపించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్నాడు సుడిగాలి సుధీర్. తాజాగా సుధీర్ హీరోగా నటించిన ‘గాలోడు’ సినిమా టీజర్ రిలీజ్ అయింది. గతంలో చేసిన సినిమాల్లో కామెడీ రోల్స్, క్లాస్ రోల్స్ చేసిన సుధీర్ తాజాగా ఈ సినిమాతో మాస్ హీరోగా మారనున్నాడు. ఇప్పుడు రిలీజ్ చేసిన ‘గాలోడు’ టీజర్ లో డిఫరెంట్ మాస్ లుక్‌లో కనిపించి అభిమానులకు షాకిచ్చాడు. నిమిషం కంటే తక్కువ నిడివి ఉన్న ఈ టీజర్‌లో సుధీర్ లుక్స్, హీరోయిజం బాగా ఎలివేట్ చేసి చూపించారు.

Samantha : ఓటిటి ఉత్తమ నటుల జాబితాలో బాలీవుడ్ హీరోయిన్స్ ని వెనక్కి నెట్టేసిన సమంత

“అదృష్టాన్ని నమ్ముకున్నవాడు కష్టాల పాలవుతాడు.. కష్టాన్ని నమ్ముకున్నవాడు అదృష్టవంతుడవుతాడు. కాని నేను ఈ రెండిటిని నమ్ముకోను.. నన్ను నేను నమ్ముకుంటాను” అనే డైలాగ్‌తో ఈ టీజర్ సాగుతుంది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో, మాస్ ఫైట్ సీన్స్ తో పక్కా మాస్ మూవీలా ఉండబోతుంది ఈ సినిమా. ‘గాలోడు’ సినిమా కచ్చితంగా సుధీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని అనిపిస్తుంది. సుధీర్ ని ఇలా మాస్ రోల్ లో చూసి అభిమానులు ఆనందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు