Papaya Cultivation : బొప్పాయిసాగుకు అనువైన రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

తోటలకు ప్రధాన సమస్యగా వైరస్ తెగుళ్లు వెన్నాడుతున్నాయి. అందువల్ల కొత్తగా తోటలను పెట్టాలనుకునే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన మేలైన రకాలను ఎంపికచేసుకుని, పంట ప్రారంభం నుండి వైరస్ ను వ్యాప్తి చేసే రసంపీల్చు పురుగుల నివారణ పట్ల అప్రమత్తంగా వుండాలి. 

Papaya Cultivation

Papaya Cultivation : తెలుగు రాష్ట్రాలలో బొప్పాయి సాగు విస్తరిస్తోంది. ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే థైవాన్ రకాలు అందుబాటులోకి వచ్చాక బొప్పాయిసాగు ఉన్నత స్థితికి చేరుకుంది. నాటిన 2 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే ఈ తోటలను, కొత్తగా సాగుచేయాలనుకునే రైతులకు  రకాల ఎంపిక కీలకం. విత్తనం మొదలు కోత కోసే సమయం వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులను పొదవచ్చని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త , డా. పి. సుధా జాకబ్ .

READ ALSO : Plant Mango : మామిడి నాటేందుకు తొలకరి అనువైన సమయం.. మార్కెట్ గిరాకీకి అనుగుణంగా రకాలు ఎంపిక

రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగువిస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటితోటలకే పరిమితమైన బొప్పాయికి, ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే  తైవాన్ రకాలని చెప్పవచ్చు. బొప్పాయి అన్ని సీజన్ లలో అందుబాటులో ఉండే పండు. ఇతర పండ్లలో కంటే పోషకాలు పుష్కలంగా వుండటంతో వినియోగం కూడా గణనీయంగా పెరిగింది.  దీంతో రైతులు సంవత్సరం పొడవునా బొప్పాయిని పండిస్తూ.. మంచి రాబడులను సొంతం చేసుకుంటున్నారు.

READ ALSO : Decreasing Mango Yield : తగ్గిన మామిడి దిగుబడి.. ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యలు

అయితే తోటలకు ప్రధాన సమస్యగా వైరస్ తెగుళ్లు వెన్నాడుతున్నాయి. అందువల్ల కొత్తగా తోటలను పెట్టాలనుకునే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన మేలైన రకాలను ఎంపికచేసుకుని, పంట ప్రారంభం నుండి వైరస్ ను వ్యాప్తి చేసే రసంపీల్చు పురుగుల నివారణ పట్ల అప్రమత్తంగా వుండాలి.  ఎక్కువ కాలం నిల్వ ఉండి, అధిక దిగుబడినిచ్చే తైవన్ రెడ్ లేడీ ని రైతులు అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు.

READ ALSO : Plant Protection In Papaya : బొప్పాయి నారుమడుల్లో చీడపీడల గండం.. నివారణకు చేపట్టాల్సిన చర్యలు

అలాగే బొప్పాయి పాలతో పపైన్ తయారుచేస్తారు. పాలకోసం కో – 2 రకాన్ని ఎన్నుకుంటే మంచి దిగుబడిని తీయవచ్చు. పంట  తొలి దశనుండి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త , డా. పి. సుధా జాకబ్ . మరి ఆసాగు ఏ విధంగా చేపట్టాలో ఆయన ద్వారానే తెలుసుకుందా.

READ ALSO : Intercrop In Papaya : బొప్పాయిలో అంతర పంటగా పసుపు సాగు

బొప్పాయి తోటలో ఎరువుల యాజమాన్యం కూడా చాల కీలకం. పశువుల ఎరువుతో పాటు రసాయన ఎరువులను కూడా అందించాలి. సూక్ష్మపోషకాలను కూడా సకాలంలో అందిస్తే తోట ఆరోగ్యంగా పెరుగుతుంది. మంచి కాయ నాణ్యత వస్తుంది . మరో వైపు తోటలో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు అంతర కృషి చేసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు