Turmeric Crop : వరుసగా కురుసిన వర్షాలకు పసుపులో దుంపకుళ్లు ఉధృతి.. నివారణ చర్యలు

Turmeric Crop : విదేశీ మారకద్రవ్యాన్ని అధికంగా ఆర్జించిపట్టే వాణిజ్యపంటల్లో పసుపును ప్రధానంగా చెప్పుకోవచ్చు. దాదాపు 72వేల హెక్టార్లలో సాగుచేయబడుతూ.. నాలుగున్నర లక్షల టన్నులకు పైగా ఉత్పత్తినిస్తోంది.

Pest Control in Turmeric Crop

Turmeric Crop : పసుపు రైతుకు దిగులు పట్టుకుంది. ఇప్పటికే సాగు వ్యయం పెరిగి ఇబ్బంది పడుతుంటే.. ఇటీవల కురిసిన అధిక వర్షాలతో తెగుళ్లు ఉధృతమయ్యాయి. చాలా చోట్లో దుంపకుళ్లు , ఆకుమచ్చ తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో నిర్మూలించకపోతే దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంది. దుంపకుళ్లు, ఆకుమచ్చతెగులు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా , జమ్మికుంట  కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

విదేశీ మారకద్రవ్యాన్ని అధికంగా ఆర్జించిపట్టే వాణిజ్యపంటల్లో పసుపును ప్రధానంగా చెప్పుకోవచ్చు. తెలుగురాష్ట్రాలలో దాదాపు 72వేల హెక్టార్లలో సాగుచేయబడుతూ.. నాలుగున్నర లక్షల టన్నులకు పైగా ఉత్పత్తినిస్తోంది. పసుపు ధరను అందులోని కుర్కుమిన్ శాతాన్ని బట్టి నిర్ణయిస్తారు. కాబట్టి సాగు ఆసాంతం సమయానుకూలంగా యాజమాన్య చర్యలను జాగ్రాత్తగా ఆచరించాలి.  ప్రస్థుతం పంట దుంప ఊరే దశలో ఉంది.

అయితే ఇటీవల కురిసిన అధిక వర్షాలకు పంట  చీడపీడల బెడద ఎక్కువైంది.  ఇప్పటికే చాలా చోట్ల దుంపకుల్లు, ఆకుమచ్చ తెగులును గుర్తించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.  దుంపకుళ్లు యాజమాన్యం సక్రమంగా లేనప్పుడు ఆశిస్తుంది. దుంప ఊరే దశలో ఈ తెగులు వల్ల నష్టం అపారంగా వుంటుందంటూ.. ఈ తెగులు  నివారణకు పాటించాల్సిన సమగ్ర చర్యలను తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా , జమ్మికుంట  కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

ట్రెండింగ్ వార్తలు