Mobile Phone Selling Scams : పాత ఫోన్లు అమ్మేస్తున్నారా? సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడినట్లే.. తస్మాత్ జాగ్ర్తత్త..!

Mobile Phone Selling Scams : మన దగ్గరుండే ఫోన్లు పాతవైపోయినా, ఏదైనా రిపేర్లు వచ్చినా.. ఛార్జింగ్ తొందరగా దిగిపోతూ చిరాకు పెడుతున్నా.. వెంటనే వాటి స్థానంలో కొత్త మొబైల్స్ కొనేస్తుంటాం.

Beware of These common online Mobile Phone Selling Scams

Mobile Phone Selling Scams : పాత సెల్‌ఫోన్లు కొంటాం.. పాడైపోయిన డబ్బా ఫోన్లు తీసుకుంటాం.. ఒక్క ఫోన్కు కిలో చక్కెర.. రెండు ఫోన్లకు రెండు కిలోల చక్కెర. అంటూ మీ వీధుల్లో..గ్రామాల్లో కొందరు తిరుగుతున్నారా..?. చక్కెర, ఇతర నిత్యావసర వస్తువులకు ఆశపడి..డబ్డా ఫోన్లు.. పాడైపోయిన ఫోన్లు అమ్మేస్తున్నారా..? అయితే మీరు సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడినట్లే. అలా పాత ఫోన్లు అమ్మటం డేంజర్ అన్న విషయం మీకు తెలుసా..?

Read Also : WhatsApp Voice Note : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై వాయిస్ నోట్ ట్రాన్స్‌స్ర్కిప్ట్ చేయొచ్చు!

మన దగ్గరుండే ఫోన్లు పాతవైపోయినా, ఏదైనా రిపేర్లు వచ్చినా.. ఛార్జింగ్ తొందరగా దిగిపోతూ చిరాకు పెడుతున్నా.. వెంటనే వాటి స్థానంలో కొత్త మొబైల్స్ కొనేస్తుంటాం. అయితే.. ఆన్లైన్లో మొబైల్ కొంటే మాత్రం పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ పెడుతుంటాం. ఎక్స్ఛేంజ్ ఆఫర్కు కూడా పనికిరాని ఫోన్లను పదికో.. పరకకో మొబైల్ షాపు వాళ్లకో.. వేరే ఎవరికైనా అమ్మేస్తుంటాం. కానీ అలా అమ్మటం డేంజర్ అని పోలీసులు చెబుతున్నారు.

పని చేయని పాత మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్న ముగ్గురిని రామగుండం సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు వేలకు పైగా పాతఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జనాల దక్కర చవకగా కొనేస్తున్న ఈ పాత మొబైల్ ఫోన్లను.. సైబర్ నేరగాళ్లు సైబర్ క్రైంలు చేసేందుకు వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వాడిన మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ సామాన్లు, చక్కెర, ఉల్లిగడ్డలు లాంటివి ఇచ్చి కొనేస్తున్నారని.. వాటిని సైబర్ క్రైం చేసే వాళ్లకు అమ్మేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

బీహార్‌లోని హతియా దియారాకు చెందిన మహ్మద్ షమీమ్, అబ్దుల్ సలాం, మహ్మద్ ఇఫ్తికార్ ముగ్గురు కలిసి గోదావరిఖని మేడిపల్లి NTPC ఏరియాలో పాతఫోన్లు కోనుగోలు చేస్తున్నారు. సైబర్ నేరాల కోసం ఈ పాత మొబైల్ ఫోన్లను ప్రజల నుంచి కొనుగోలు చేసి ప్లాస్టిక్ వస్తువులు లేదా డబ్బును ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అందిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ముగ్గురి దగ్గర మూడు గోనె సంచులలో నిల్వ చేసిన 4 వేల పాత మొబైల్ ఫోన్లు లభించాయి.

వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ఈ పాత మోబైల్ ఫోన్లను నిందితులు బిహార్కు తరలిస్తారు. అక్కడ తమ అనుచరులకు అప్పగించి అసోసియేట్ ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్తారా, దియోఘర్ తదితర ప్రాంతాలకు చెందిన సైబర్ మోసగాళ్లకు సఫ్లై చేస్తారు. సైబర్ మోసగాళ్లకు విక్రయించే ముందు వారి సహచరుడు అక్తర్ ఈ మొబైల్ ఫోన్ల సాఫ్ట్వేర్, మదర్ బోర్డు ఇతర భాగాలను రిపేర్ చేసి సైబర్ నేరగాళ్లకు ఇచ్చేస్తారు.

ఈ సైబర్ మోసగాళ్లు రిపేర్ చేసిన ఫోన్లను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడి మోసపూరితంగా సంపాదించిన డబ్బును అక్తర్, ఈ ముగ్గురు పంచుకుంటారు. ఎండ్ వాయిస్- ప్రజలు తమ పాత మొబైల్ ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. పాత ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయిస్తే వాటిని సైబర్ మోసాలకు ఉపయోగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Read Also : Airtel Payments Bank : ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ‘ఫేస్ మ్యాచ్‌‘ ఇదిగో.. సెల్ఫీ వెరిఫికేషన్‌తో కస్టమర్ అకౌంట్ సేఫ్..!

ట్రెండింగ్ వార్తలు