Airtel Payments Bank : ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ‘ఫేస్ మ్యాచ్‌‘ ఇదిగో.. సెల్ఫీ వెరిఫికేషన్‌తో కస్టమర్ అకౌంట్ సేఫ్..!

Airtel Payments Bank Face Match : ఫేస్ మ్యాచ్ అనేది స్మార్ట్ సెక్యూరిటీ టూల్. మీరు సాధారణంగా మీ అకౌంట్ ఎలా ఉపయోగిస్తారనే దానిపై నిఘా ఉంచుతుంది. మీరు ఎన్నిసార్లు లాగిన్ చేస్తున్నారు. ఎక్కడ నుంచి లాగిన్ చేస్తున్నారు.

Airtel Payments Bank : ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ‘ఫేస్ మ్యాచ్‌‘ ఇదిగో.. సెల్ఫీ వెరిఫికేషన్‌తో కస్టమర్ అకౌంట్ సేఫ్..!

Airtel Payments Bank launches face match to secure customer accounts ( Image Source : Google )

Airtel Payments Bank Face Match : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ సొంత సర్వీసుల్లో ఒకటైన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు.. సరికొత్త సేఫ్టీ ఫీచ్ తీసుకొచ్చింది. అదే.. ఫేస్ మ్యాచ్ కొత్త సెక్యూరిటీ ఫీచర్‌.. సైబర్ మోసాల నుంచి కస్టమర్‌లను రక్షించే లక్ష్యంతో ఈ ఫీచర్ తీసుకొచ్చింది. మీకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉందని ఊహించుకోండి.

Read Also : Tech Tips Telugu : మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ 10 టిప్స్ తప్పక పాటించండి!

ఇప్పుడు, చాలా మంది యూజర్ల మాదిరిగానే మీ బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి, డబ్బును ట్రాన్స్‌పర్ చేయడానికి లేదా బిల్లులు చెల్లించడానికి మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌ను ఉపయోగించవచ్చు. కానీ, ఆన్‌లైన్‌లో మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ బ్యాంకింగ్ అకౌంట్ యాక్సెస్ చేయడానికి ప్రయత్నించే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అదే.. ఫేస్ మ్యాచ్ ఉంటే.. అలాంటి ఇబ్బంది లేకుండా కస్టమర్లు తమ బ్యాంక్ అకౌంట్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.

ఫేస్ మ్యాచ్ ఎలా పనిచేస్తుందంటే? :
ఫేస్ మ్యాచ్ అనేది స్మార్ట్ సెక్యూరిటీ టూల్. మీరు సాధారణంగా మీ అకౌంట్ ఎలా ఉపయోగిస్తారనే దానిపై నిఘా ఉంచుతుంది. మీరు ఎన్నిసార్లు లాగిన్ చేస్తున్నారు. ఎక్కడ నుంచి లాగిన్ చేస్తున్నారు. మీరు చేసే లావాదేవీలు, ఇతర అంశాలను పరిశీలిస్తుంది.

కొత్త లొకేషన్ నుంచి భారీ మొత్తంలో లావాదేవీ వంటి ఏదైనా అసాధారణమైన గమనించినట్లయితే.. “థ్రెట్ స్కోర్”గా వెంటనే అలర్ట్ పంపుతుంది. మీ అకౌంట్ యాక్సస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నది నిజంగా మీరేనని నిర్ధారించేందుకు ఫేస్ మ్యాచ్ ఉపయోగపడుతుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ మీకు ఫేస్ మ్యాచ్ యాక్టివేట్ అయిందని తెలియజేస్తూ మీ ఫోన్‌లో నోటిఫికేషన్ పంపుతుంది.

సెల్ఫీతో కస్టమర్ ఫొటో కంపేరింగ్ :
మీరు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ని ఉపయోగించి త్వరగా సెల్ఫీ తీసుకోమని సూచిస్తుంది. ఈ సెల్ఫీ తర్వాత మీరు మీ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అందించిన ఫొటోతో కంపేర్ చేసుకోవచ్చు. సెల్ఫీలో ఉన్న వ్యక్తి నిజానికి మీరేనని నిర్ధారించుకోవడానికి యాప్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. సెల్ఫీ మీ ఒరిజినల్ ఫోటోతో సరిపోలితే.. మీరు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ లావాదేవీని పూర్తి చేయవచ్చు. కానీ, ఏదైనా సరిపోలకపోతే.. సిస్టమ్ లావాదేవీని బ్లాక్ చేస్తుంది. మీ ఫింగర్ ఫ్రింట్ ఉపయోగించి తదుపరి ధృవీకరణకు సమీపంలోని బ్యాంక్ లొకేషన్‌ను విజిట్ చేయాల్సి ఉంటుంది.

ఇది ఎందుకంటే? :
ఆన్‌లైన్ బ్యాంకింగ్ పెరుగుదలతో మోసగాళ్ళు తెలివిగా మారుతున్నారు. మోసగించడానికి, డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను కనుగొంటారు. మీ అకౌంట్ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు లేదా మీకు తెలియకుండానే డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

మీరు మాత్రమే మీ అకౌంట్ ఉపయోగించుకోవచ్చు. కస్టమర్లను సురక్షితంగా ఉంచేందుకు బ్యాంక్ కట్టుబడి ఉందని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఈవో అనుబ్రత బిస్వాస్ వివరించారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను సురక్షితంగా, సులభంగా వాడేందుకు సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తోంది.

Read Also : WhatsApp Voice Note : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై వాయిస్ నోట్ ట్రాన్స్‌స్ర్కిప్ట్ చేయొచ్చు!