Cococa Plantation : కొబ్బరి, పామాయిల్ తోటల్లో అంతర పంటగా కోకో

Cococa Plantation : ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాజిల్లాలు కొబ్బరిసాగుకు పెట్టింది పేరు. అధిక వర్షపాతం, గాలిలో తేమశాతం అధికంగా వుండటంతో కొబ్బరిసాగుకు అత్యంత అనువుగా వుంది.

Cococa Plantation as Intercrop in Coconut

Cococa Plantation : రైతులు ఎన్ని పంటలు పండించినా, రక రకాల రూపంలో నష్టాలు చూస్తూనే ఉన్నారు. దీంతో సాగును లాభసాటిగా మార్చుకోవడానికి, అనేక పద్ధతులు అవలంభిస్తున్నారు. ప్రధాన పంటకు తోడు, అంతర పంటలను సాగుచేస్తే, ఆర్ధికంగా ఆదుకుంటాయి.

ఈ పంటల సాగుతో ప్రధాన పంటకు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పనిలేదు. దీన్ని తూచా తప్పకుండా పాటిస్తూ.. కొబ్బరి, పామాయిల్ తోటల్లో అంతర పంటలుగా కోకో సాగుచేస్తూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. మరి ఆయన అనుభవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : Coconut Water : కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగితే ఆరోగ్యానికి మంచిది? ఎలాంటి వ్యక్తులు తాగకూడదు? మీకు తెలుసా

ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాజిల్లాలు కొబ్బరిసాగుకు పెట్టింది పేరు. అధిక వర్షపాతం, గాలిలో తేమశాతం అధికంగా వుండటంతో కొబ్బరిసాగుకు అత్యంత అనువుగా వుంది. అయితే సాగు పెట్టుబడి పెరగటం, ఆదాయం నామమాత్రంగా వుండటంతో,  ఏకపంటగా కొబ్బరిసాగు రైతుకు గిట్టుబాటు కావటం లేదు.

దీంతో అంతర పంటలసాగును చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లా, పెరవళి మండలం, తీపర్రు గ్రామానికి చెందిన రైతు గంగరాజు తనకున్న 10 ఎకరాల్లో 2010 లో 5 ఎకరాల కొబ్బరితోట, 5 ఎకరాల పామాయిల్ నాటారు. నాటిన 4 దిగుబడి ప్రారంభమైంది.

అయితే, సాగులో పెట్టుబడులు పెరడం.. మార్కెట్ ధరలు గిట్టుబాటు కాకపోవడం.. అంతర పంటగా 2016 కోకోను నాటారు . నాటిన ఏడాదిన్నర నుండి దిగుబడి ప్రారంభమైనది. అంతర పంట నుండి వచ్చిన ఆదాయం పెట్టుబడి ఖర్చులకు సరిపోతుండగా..   ప్రధాన పంట నుండి వచ్చి ఆదాయం మిగులుతుందని రైతు చెబుతున్నారు. దీర్ఘకాలిక పంటలను వేస్తున్నా, అందులో కూడా అంతర పంటలను వేసి , ఏమాత్రం భూమిని, సమయాన్ని వృథా చేయకుండా రాబడి పొందుతున్నా రైతు సింహాద్రి గంగరాజు, సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Read Also : Coconut Plantation : కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకో, వక్కసాగు.. అదనపు ఆదాయం అంటున్న రైతు

ట్రెండింగ్ వార్తలు