Coconut Water : కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగితే ఆరోగ్యానికి మంచిది? ఎలాంటి వ్యక్తులు తాగకూడదు? మీకు తెలుసా

Good Time To Drink Coconut Water : కొబ్బరి నీళ్లు తాగడానికి సమయం అంటూ ఉందా? ఏ సమయంలో కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది? ఎలాంటి వ్యక్తులు ఈ నీళ్లు తాగకూడదు? ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉండే ఉంటాయి. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు?

Coconut Water : కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగితే ఆరోగ్యానికి మంచిది? ఎలాంటి వ్యక్తులు తాగకూడదు? మీకు తెలుసా

Good Time To Drink Coconut Water (Photo : Google)

Updated On : November 14, 2023 / 7:18 PM IST

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతి సిద్ధంగా లభించే కోకోనట్ వాటర్ లో బోలెడు పోషకాలు ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిచ్చే గుణం కొబ్బరి నీటికి ఉంది. ఈ నీరు తాగితే డీహైడ్రేషన్‌, ఎండ వేడి తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు అంటున్నారు. సమ్మర్ లో చాలామందికి ఇదే ఫేవరెట్ డ్రింక్. శరీరం చెమట రూపంలో కోల్పోయిన నీటిని ఇది భర్తీ చేస్తుంది. ఆ విధంగా శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది.

కాగా, కొబ్బరి నీళ్లు తాగడానికి సమయం అంటూ ఉందా? ఏ సమయంలో కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది? ఎలాంటి వ్యక్తులు ఈ నీళ్లు తాగకూడదు? ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉండే ఉంటాయి. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు?

Also Read : బంగారం కొంటున్నారా.. తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు, ఇలా చేస్తే మీకే లాభం

ఏ సమయంలో కొబ్బరి నీరు తీసుకోవాలి?
”ప్రతి రోజూ ఉదయం 10 గంటల సమయంలో ఒక గ్లాసు కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడంలో సాయపడుతుంది. చర్మం తేమ నియంత్రణలో ఉండడమే కాకుండా బ్యాక్టీరియా సంబంధ ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తి చర్మానికి లభిస్తుంది” అంటూ ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే నిజం కాబోలు అని అంతా అనుకుంటున్నారు. దీనిపై ఆరోగ్య నిపుణులు స్పందించారు.

Good Time To Drink Coconut Water

Ideal Time To Drink Coconut Water (Photo : Google)

కొబ్బరి నీళ్లతో వెయిట్ లాస్..
”కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఒక కప్పు కొబ్బరి నీళ్లలో 45 కేలరీలు మాత్రమే ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వారికి, బరువుని అదుపులో ఉంచుకోవాలని అనుకునే వారికి ఇదొక మంచి పానియం. సోడా లేదా షుగర్ డ్రింక్స్ తీసుకోవడానికి బదులుగా కొబ్బరి నీళ్లు తీసుకోవడం శ్రేష్టం” అని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.

సాయంత్రం కన్నా పొద్దునే బెస్ట్..
“కొబ్బరి నీళ్లను సాయంత్రం పూట తాగడం కంటే పొద్దునే తాగడం మంచిది. అయితే మితంగానే తీసుకోవాలి. కొబ్బరి నీరు రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు, శరీర జీవక్రియలకు అవసరమైన ఉత్తేజాన్ని అందిస్తుంది. కొబ్బరి నీరు ఒక అద్భుతమైన సహజ ఎలక్ట్రోలైట్ మూలం. వ్యాయామం తర్వాత రీహైడ్రేషన్ కోసం ఇది మంచి ఎంపిక” అని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.

Also Read : ఉడకబెట్టిన గుడ్డు Vs ఆమ్లెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ మంచిది? ఇలా తెలుసుకోండి..

అలాంటి వారు కొబ్బరి నీరు తాగొద్దు..
అయితే, కొబ్బరి నీరు అందరికీ మంచిదేనా? ఎలాంటి వ్యక్తులు అయినా తాగొచ్చా? అంటే కాదని అంటున్నారు వైద్య నిపుణులు. కొంతమంది వ్యక్తులకు కొబ్బరి నీరు మంచిది కాదన్నారు. రక్తంలో అధిక మోతాదులో పొటాషియం నిల్వలు ఉన్న వారు కొబ్బరి నీరుకు దూరంగా ఉండడమే మంచిది. అలాగే కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడే వారు, గుండె స్పందన సమస్యలు ఎదుర్కొంటున్న వారు కొబ్బరి నీరు తాగరాదు” అని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు.

కొబ్బరి నీరు ప్రతిరోజూ తాగొచ్చా?
”కొందరు వ్యక్తులు నిద్రకు ముందు ఓదార్పు, హైడ్రేటింగ్ కోసం కొబ్బరి నీరు తాగుతారు. ఇది కరెక్ట్ కాదు. మీ ప్రాధాన్యతలను, కొబ్బరి నీరు మీ నిద్రను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? అన్న విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. వ్యక్తులను బట్టి వారి ప్రాధాన్యతలు, దిన చర్యలు మారుతూ ఉంటాయి. కాబట్టి మీ శరీర అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా కొబ్బరి నీళ్లను తీసుకోవడం మంచిది” అని వైద్య నిపుణులు సూచించారు.

Best Time To Drink Coconut Water

Best Time To Drink Coconut Water (Photo : Google)

అదే సమయంలో ఆరోగ్యంగా ఉన్న వారు ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు తాగాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు తేల్చి చెప్పారు. కొబ్బరి నీరు ఆరోగ్యకరమైన ఎంపికే. అందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే, అందరూ కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. కొబ్బరి నీరులో సహజంగా చక్కెర ఉంటుంది. కనుక మితంగా తీసుకోవడం చాలా కీలకం అని వైద్య నిపుణులు వివరించారు.

Also Read : బ్రాండెడ్ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్లు.. ఫ్యాక్టరీ ఔట్‌లెట్స్‌లో ఎందుకిలా? బిగ్ సీక్రెట్ ఏంటి?