Paper Making : కాగితం తయారీకి ఉపయోగపడే పంట

Paper Making : ఈ కోవలోనే శనిగవారిపాలెం గ్రామానికి చెందిన రైతు రవీందర్ రెడ్డి  12 ఏళ్ళుగా 5 ఎకరాల్లో సరుగుడు సాగు చేపడుతున్నారు. ఈ పంట సాగుకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ ఏడాది 4 ఎకరాల్లో నర్సరీని కూడా పెంచుతున్నారు.

Crop Useful for Paper Making

Paper Making : సముద్ర తీరప్రాంతాల్లో సరుగుడు తోటలు విస్తారంగా సాగవుతున్నాయి. నాటిన 4 సంవత్సరాలకు చేతికందే ఈ కలప  రైతులకు ఆర్ధికంగా చేయూతను అందిస్తోంది. సురుగుడులో ప్రస్థుతం క్లోన్ మొక్కలు అందుబాటులోకి రావటంతో రైతులు ఎకరాకు 60 నుండి 80 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రైతు పంట సాగుతో పాటు నర్సరీని ఏర్పాటు చేసి మంచి లాభాలను పొందుతున్నారు. మరి ఆ వివరాలను రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం.

Read Also : Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్న వరినాట్లు – వరిలో కలుపు అరికట్టే విధానం

భీడు బంజరు భూములు, ఇసుక నేలలు, ఎర్రనేలలు, ఆమ్లా క్షారనేలల్లో సైతం సునాయాసంగా పెరిగే కల్పవృక్షం సరుగుడు. పెద్ద పెద్దగాలులను తట్టుకునే ఈ పంటను నెల్లూరు జిల్లా, ఉలవపాడు మండలంలో అధికంగా సాగుచేస్తున్నారు. నీటి వసతి కిందే కాక, వర్షాధారంగా కూడా ఈ తోటలను పెంచుకునే ఆస్కారం ఉంది. బలమైన గాలులు వీచే సముద్ర తీర ప్రాంతాల్లో.. ఈ తోటల సాగు.. తీరప్రాంత గ్రామాలకు రక్షణగా ఉంటుంది. సరుగుడు కర్రను వివిధ రంగాల్లో ఉపయోగిస్తారు.

కలప గుజ్జును పేపరు తయారికి వినియోగిస్తారు. అందుకే సముద్ర తీర ప్రాంతమైన ఉలవపాడు మండలంలో వీటి సాగు అధికంగా ఉంది . శ్రమ, పెట్టుబడి  తక్కువగా ఉండటం.. యాజమాన్యం సులభంగా ఉండటంతో చాలా మంది రైతులు ఈ పంట సాగు పట్ల మొగ్గుచూపుతున్నారు. ఈ కోవలోనే శనిగవారిపాలెం గ్రామానికి చెందిన రైతు రవీందర్ రెడ్డి  12 ఏళ్ళుగా 5 ఎకరాల్లో సరుగుడు సాగు చేపడుతున్నారు. ఈ పంట సాగుకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ ఏడాది 4 ఎకరాల్లో నర్సరీని కూడా పెంచుతున్నారు.

సరుగుడు చెట్లు నిటారుగా ఉంటాయి. పూర్తిగా పెరగడానికి మూడున్నర నుండి 4 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ చెట్లు పూర్తిగా పెరిగాక వ్యాపారులే రైతుల దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. చెట్టు నాణ్యత బట్టి ఒక ఎకరానికి రూ. 3 నుండి 5 లక్షల ధర వస్తుంది. ఎక్కువగా పెట్టుబడి, మైంటెనెన్స్ లేకపోవడం ద్వారా ఈ పంట నుంచి రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి. ఈ చెట్లని ఎక్కువగా కాగితం, ప్లై వుడ్ తయారు చేయడానికి వాడుతారు. దాని కారణంగా ఈ చెట్లకి మంచి డిమాండ్ ఉంది.

Read Also : Paddy Cultivation : ప్రకృతి విధానంలో లైన్ సోయింగ్ విధానంలో వరి సాగు

ట్రెండింగ్ వార్తలు