Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్న వరినాట్లు – వరిలో కలుపు అరికట్టే విధానం
Paddy Cultivation : వరిసాగు పనులు ముమ్మరంగా జరుగుతున్న కాలం ఇది. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బావులల్లో, కుంటల్లో , చెరువుల్లో నీరు సమృద్ధిగా చేరాయి.

Varilo Kalupu Nivarana
Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో వరి వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల నాట్లు పడగా, మరికొన్ని చోట్ల నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు రైతులు. అయితే మొదటి దశలోనే నాటు వేసిన 3 నుండి 4 రోజుల్లోనే రసాయన మందుల ద్వారా కలుపు నివారిస్తే అధిక దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉంటుంది. మరి వివిధ దశల్లో చేపట్టాల్సిన కలుపు నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కృషి విజ్ఞాన కేంద్రం , ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. జే. వీరన్న.
Read Also : Paddy Management : కూరగాయ పంటల్లో నారుమడి పెంపకం
వరిసాగు పనులు ముమ్మరంగా జరుగుతున్న కాలం ఇది. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బావులల్లో, కుంటల్లో , చెరువుల్లో నీరు సమృద్ధిగా చేరాయి. దీంతో సకాలంలో నాట్లు వేస్తున్నారు రైతులు. ముఖ్యంగా వరి పంటలో రైతులను కలుపు మొక్కల సమస్య వేధిస్తుంది. ఒక వైపు కూలీల కొరత, మరో వైపు వానలతో కలుపు మొక్కలు రో జురోజుకూ అధికమై పంట ఎదుగుదలను అడ్డుకుంటాయి.
అలాగే భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటాయి. కాబట్టి మొదటి దశలోనే సమగ్ర కలుపు నివారణ చర్యలు చేపడితే ప్రధాన పొలంలో కలుపు పెరగకుండా నిరోధించవచ్చు. తద్వారా కూలీల ఖర్చు, రసాయన ఎరువుల ఖర్చు మిగిలిపోతాయి.
అయితే వరి నాటే విధానం బట్టి కలుపు పెరుగుతూ ఉంటుంది , అందుకు తగ్గట్టుగానే మందులు మారుతూ ఉంటాయి. కాబట్టి రైతులు ఏ కలుపుకు ఏమందులను పిచికారి చేయాలో తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కృషి విజ్ఞాన కేంద్రం , ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. జే. వీరన్న.
Read Also : Paddy Crop : తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకున్న వరినాట్లు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు