Paddy Management : కూరగాయ పంటల్లో నారుమడి పెంపకం

Paddy Management : తెలుగు రాష్ట్రాలలో ఏడాది పొడవునా కూరగాయలు పండించుటకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ.. దిగుబడి తక్కువగా ఉంది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి కాలాలలో సాగుచేస్తారు.

Paddy Management : కూరగాయ పంటల్లో నారుమడి పెంపకం

Vegetable Narumadi Management Techniques

Narumadi Management : కూరగాయల సాగులో నర్సరీ దశ ఎంతో ముఖ్యమైనది. అందుకే నారుమడి దశలోనే రైతులు శ్రద్ధ వహించాలి. ఇప్పుడు నూటికి 90 శాతంమంది  రైతులు హైబ్రిడ్‌ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. కానీ  చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. కొంత మంది ప్రోట్రేలలో నార్ల పెంపకం చేపడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ కూరగాయల సాగు చేసే రైతులు నాణ్యమైన నారు అందిరావడానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం..

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

తెలుగు రాష్ట్రాలలో ఏడాది పొడవునా కూరగాయలు పండించుటకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ.. దిగుబడి తక్కువగా ఉంది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి కాలాలలో సాగుచేస్తారు. రబీ, వేసవితో పోలిస్తే ఖరీఫ్ లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి రుతుపవనాల రాక నుంచి రుతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఈ సీజన్ లో సాగు విస్తీర్ణం అధికంగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం కూడా పెరుగుతుంది.

కాబట్టి ఖరీఫ్ కూరగాయల సాగుచేసే రైతులు.. మొదట నారుపెంపకంపై జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారుపోసి తర్వాత పొలంలో నాటాలి. అయితే ఈ రకాల విత్తనాలకు చాలా ఖరీదు ఉంటుంది కాబట్టి.. ప్రతి విత్తనం మొలకెత్తేలాగా చూసుకోవాలి. ప్రతి విత్తనం మొలవాలంటే నారుమడి పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్యం ఏంటో తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత.

సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రో ట్రేలలో నారును పెంచటం వలన ప్రతీ విత్తనం నారుమొక్కగా అందివస్తుంది.  షేడ్ నెట్ లలో వాతావరణం నియంత్రణలో ఉంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా వుంటుంది. నారు మొక్కల్లో వేరువ్యవస్థ సమానంగా పెరగటం వల్ల ప్రధానపొలంలో నాటినప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం ఉంటుంది కనుకు దిగుబడులు ఆశాజనకంగా వుంటాయి.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు