Tejaswi Rao : ఫస్ట్ క్లాస్ లోనే నా ఫస్ట్ కిస్.. ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరోయిన్ కామెంట్స్ వైరల్..

ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో హీరోయిన్ గా అందర్నీ అలరించింది తేజస్వి. (Tejaswi Rao)

Tejaswi Rao : ఫస్ట్ క్లాస్ లోనే నా ఫస్ట్ కిస్.. ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరోయిన్ కామెంట్స్ వైరల్..

Tejaswi Rao

Updated On : November 27, 2025 / 10:52 PM IST

Tejaswi Rao : షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమ్ తెచ్చుకున్న తేజస్వి రావు ఇటీవల కమిటీ కుర్రోళ్ళు సినిమాలో మెప్పించింది. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో హీరోయిన్ గా అందర్నీ అలరించింది తేజస్వి. రాజు వెడ్స్ రాంబాయి చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గ్రామీణ యువతి పాత్రలో తేజస్వి అదరగొట్టేసింది.(Tejaswi Rao)

మేకప్ లేకుండా, విలేజ్ అమ్మాయి లుక్ లో, ఎమోషన్ సీన్స్ లో చాలా న్యాచురాల్ గా నటించడంతో తేజస్వికి మంచి పేరొచ్చింది. ఈ సక్సెస్ తో తేజస్వి వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజస్వి తన ఫస్ట్ కిస్ గురించి చెప్పుకొచ్చింది.

Also Read : Manchu Manoj : తండ్రి దగ్గర పీక్కొని తినకూడదు.. కొడుకు అనేవాడు ఎలా ఉండాలి అంటే.. మంచు మనోజ్ వ్యాఖ్యలు వైరల్..

తేజస్వి మాట్లాడుతూ..ఫస్ట్ క్లాస్ నా ఫస్ట్ కిస్. క్లాస్ లో నా పక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు. అతను ఎరేజర్ కింద పడేసాడు. అది తీయమని నన్ను అడిగాడు. నేను ఆ ఎరేజర్ తీద్దామని బెంచ్ కిందకు దిగాను. అతను కూడా బెంచ్ కిందకు వచ్చి నా బుగ్గ మీద కిస్ చేసాడు. అది ఒక క్యూట్ మూమెంట్. అప్పటికి అది కిస్ అని కూడా తెలీదు. అది ఒక మూమెంట్ అప్పుడు అంతే అని తెలిపింది. దీంతో పలువురు నెటిజన్లు దీన్ని ఫస్ట్ కిస్ అంటారా? అసలు ఫస్ట్ క్లాస్ లో జరిగింది ఇలాంటి సంఘటన కూడా గుర్తుందా అని కామెంట్స్ చేస్తున్నారు.