Manchu Manoj : తండ్రి దగ్గర పీక్కొని తినకూడదు.. కొడుకు అనేవాడు ఎలా ఉండాలి అంటే.. మంచు మనోజ్ వ్యాఖ్యలు వైరల్..
ఈ ఈవెంట్లో మనోజ్ మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. (Manchu Manoj)
Manchu Manoj
Manchu Manoj : ఇటీవల కొన్నాళ్ల క్రితం మంచు కుటుంబంలో గొడవలు రోడ్డు మీదకు ఎక్కిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్ పై విష్ణు, మోహన్ బాబు పలు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం, మంచు మనోజ్ కూడా ఫిర్యాదు చేయడం.. వీళ్ళు పోలీసుల వరకు వెళ్లడం, సోషల్ మీడియాలో ఒకర్నొకరు తిట్టుకోవడం జరిగాయి. కానీ ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు.(Manchu Manoj)
మంచు మనోజ్ అన్న సినిమాలకు శుభాకాంక్షలు చెప్పారు. తండ్రి మోహన్ బాబు గురించి మొదట్నుంచి పాజిటివ్ గానే చెప్తూ వస్తున్నారు. మంచు ఫ్యామిలీ సమస్యలు తీరిపోయాయి అని విడివిడిగానే ఉన్నా ఇప్పుడు కొట్టుకోవట్లేదు, తిట్టుకోవట్లేదు అని అంతా భావిస్తున్నారు. అయితే తాజాగా నేడు వానర సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి మంచు మనోజ్ గెస్ట్ గా వచ్చాడు. ఈ సినిమా హీరోని అతని తండ్రి సపోర్ట్ చేసాడు. ఈ విషయం మాట్లాడుతూ ఈ ఈవెంట్లో మనోజ్ మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
మనోజ్ మాట్లాడుతూ.. ప్రతి ఫీల్డ్ లో తండ్రి తన కొడుకుని తీసుకురావాలని అందరూ అనుకుంటారు. తండ్రి తపన అది. తండ్రిది పోలీస్ ఫీల్డ్, కొడుకు MBA చదివాడు. కానీ సినిమా చేస్తాను అనగానే తండ్రి నిలబడి సపోర్ట్ చేశారు అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఆయన ఆర్టిస్ట్ అవుదామని వచ్చారు. మీ కలను మీ అబ్బాయి తీరుస్తున్నాడు.
ఇటీవల మా నాన్న 50 ఏళ్ళ నటన ఫంక్షన్ జరిగింది. అప్పుడే నా కొత్త వెంచర్ మోహన రాగ ప్రకటించాను. నాకు, మా నాన్నకు మోహన రాగం అంటే ఇష్టం. అందుకే ఆ పేరు మీదే మ్యూజిక్ వెంచర్ మొదలు పెట్టాను. తండ్రికి మనం ఇవ్వాలి. తండ్రి దగ్గర మనం పీక్కొని తినకూడదు. అది నేను నమ్ముతాను. కొడుకు అనే వాడు తల్లి తండ్రులను చూసుకోవాలి. వాళ్లకు తిరిగి ఏదైనా ఇవ్వాలి అని నేను నమ్ముతాను అని అన్నారు. దీంతో మనోజ్ వ్యాఖ్యలు విష్ణుని ఉద్దేశించా? లేక మాములుగా చెప్పాడా అని వైరల్ గా మారాయి.
Also Read : Anaganaga Oka Raju : ‘భీమవరం బాల్మ..’.. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..
