Anaganaga Oka Raju : ‘భీమవరం బాల్మ..’.. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..
తాజాగా ఈ సినిమా నుంచి భీమవరం బాల్మ.. అంటూ సాగే పాటను విడుదల చేశారు.(Anaganaga Oka Raju)
Anaganaga Oka Raju
Anaganaga Oka Raju : తక్కువ సినిమాలతోనే అందర్నీ మెప్పించిన నవీన్ పొలిశెట్టి చివరగా అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మెప్పించాడు. మధ్యలో యాక్సిడెంట్ అవ్వడం, దాన్నుంచి కోలుకోవడంతో నెక్స్ట్ సినిమా ‘అనగనగా ఒకరాజు’ కాస్త లెట్ అయి సంక్రాంతికి వస్తుంది.(Anaganaga Oka Raju)
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా మారి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ నిర్మాణంలో అనగనగా ఒక రాజు సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు గ్లింప్స్, ప్రమోషనల్ వీడియోలు రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి భీమవరం బాల్మ.. అంటూ సాగే పాటను విడుదల చేశారు.
ఈ పాటను మిక్కీ జె మేయర్ సంగీత దర్శకత్వంలో చంద్రబోస్ రాయగా నవీన్ పోలిశెట్టి, నూతన మోహన్ పాడారు. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమా 14 జనవరి 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..
