Shadab Jakati: ఒక్క రీల్‌తో పేరు మొత్తం మటాష్..! చిక్కుల్లో ప్రముఖ కంటెంట్ క్రియేటర్.. పోలీస్ కేసు నమోదు..

పాపులారిటీ అతడి తలకు ఎక్కిందని, జకాతి తన గౌరవాన్ని తన చేతులారా నాశనం చేసుకున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Shadab Jakati: ఒక్క రీల్‌తో పేరు మొత్తం మటాష్..! చిక్కుల్లో ప్రముఖ కంటెంట్ క్రియేటర్.. పోలీస్ కేసు నమోదు..

Updated On : November 27, 2025 / 10:55 PM IST

Shadab Jakati: అతడు ఒక కంటెంట్ క్రియేటర్. ఈ మధ్య కాలంలో బాగానే ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియా సెలెబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాను చేసే రీల్స్ తో పబ్లిసిటీ సంపాదించాడు. ఇలా ఫేమస్ అయ్యాడో లేదో.. అలా చేతులారా తన ఇమేజ్ ను తానే డ్యామేజ్ చేసుకున్నాడు. అతడు చేసిన ఓ రీల్ తో.. మొత్తం మటాష్ అయిపోయాడు. పేరు, ప్రతిష్టలు గంగలో కలిసిపోయాయి. అంతేనా.. పోలీసు కేసు కూడా నమోదైంది.

అతడి పేరు షాదాబ్ జకాతి. మీరట్ కు చెందిన కంటెంట్ క్రియేటర్. తాజాగా చేసిన ఓ రీల్ అతడిని వివాదంలోకి నెట్టింది. సోషల్ మీడియాలో జనం అతడిని ఏకిపారేస్తున్నారు. నువ్వసలు మనిషేనా అని తిట్టిపోస్తున్నారు. మైనర్ బాలికతో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ అతడిపై ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు అందింది.

“10 రూపాయల బిస్కెట్” ట్రెండ్ ద్వారా సోషల్ మీడియా స్టార్‌గా మారిన జకాతి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. అసభ్యకరమైన, లైంగిక, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

తీవ్ర వివాదాస్పదమైన ఆ రీల్ లో అసలేముంది అనే విషయంలోకి వెళితే.. ఆ వీడియోలో, జకాతి షాపు యజమాని పాత్ర పోషించాడు. ఒక పాప షాక్ కి వస్తుంది. అతడి దగ్గర కొన్ని వస్తువులు కొంటుంది. అతడు పాపను డబ్బులు అడుగుతాడు. అయితే, డబ్బులు తన తల్లి ఇస్తుందని చెప్పి అక్కడి నుంచి చిన్నారి వెళ్లిపోతుంది. దానికి జకాతి.. ఈ పాపే ఇంత అందంగా ఉందంటే, పాప తల్లి ఇంకెంత అందంగా ఉంటుందో అని అంటాడు. అంతేకాదు పాప ఇంటికి వెళ్తాడు. నాకు డబ్బుకు బదులుగా ముద్దు ఇవ్వండి అని పాప తల్లితో చెబుతాడు”.. ఇప్పుడీ వీడియో రచ్చ రచ్చగా మారింది.

జకాతిపై నెటిజన్లు భగ్గుమన్నారు. పిల్లలతో మాట్లాడే మాటలేనా ఇవి అని సీరియస్ అవుతున్నారు. మైనర్ బాలికతో అతడు అన్న మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయని, అతడిపై పోక్సో కేసు నమోదు చేయాలని, అతడిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. అంతేకాదు కొందరు అతడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పాపులారిటీ అతడి తలకు ఎక్కిందని, జకాతి తన గౌరవాన్ని తన చేతులారా నాశనం చేసుకున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అశ్లీల కంటెంట్ ఉన్నందున జకాతిపై పోక్సో కేసు నమోదు చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.

నిజానికి షాబాద్ జకాతి చేసే రీల్స్ బాగుంటాయియి. ఇంటిల్లిపాది, కుటుంబసభ్యులు అంతా కలిసి చూడగలిగే కంటెంట్ సృష్టిస్తాడు అనే పేరుంది. అయితే, తాజా రీల్ అతడి పరువు మొత్తం పోయింది.

Also Read: ఎంతకు తెగించార్రా..! కోడి గుడ్లకు రంగు వేసి నాటుకోడి గుడ్లు అంటూ అమ్మకాలు..