Premalo Rendosaari : ‘ప్రేమలో రెండోసారి’.. త్వరలో ఓటీటీలోకి..
తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించి మూవీ యూనిట్ మాట్లాడారు. (Premalo Rendosaari)
Premalo Rendosaari
Premalo Rendosaari : రమణ సాకే, వనితా గౌడ జంటగా తెరకెక్కిన సినిమా ప్రేమలో రెండోసారి. సిద్ధా క్రియేషన్స్ బ్యానర్‌పై సాకే రామయ్య సమర్పణలో నీరజ లక్ష్మి సాకే నిర్మాణంలో సత్య మార్క దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జబర్దస్త్ శ్రీను, బాబీ, దుర్గారావు, ఫణి.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
ఈ యాక్షన్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఇటీవల నవంబర్ 21న థియేటర్స్ లో విడుదలయింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించి మూవీ యూనిట్ మాట్లాడారు.
ఈ సినిమా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ప్రేమలో రెండోసారి సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. చిన్న సినిమాకు రోజూ థియేటర్లు పెరుగుతున్నాయి. చిన్నతనంలో హీరో హీరోయిన్ ఇద్దరి మధ్య స్నేహం, పెద్దయ్యాక అది ప్రేమ కాదని తెలుసుకోవడం కోసం హీరోయిన్ హీరోకి టెస్ట్ పెట్టడం, అది ప్రేమ అని తెలుసుకునే సమయానికి పెద్దలు అడ్డుకోవడం.. లాంటి ప్రేమ కథాంశంతో ఈ సినిమాని గ్రామీణ నేపథ్యంలో రియల్ లొకేషన్స్‌లో తీసాము. త్వరలోనే మా సినిమా ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది అని తెలిపారు.
