Paddy Cultivation : ప్రకృతి విధానంలో లైన్ సోయింగ్ విధానంలో వరి సాగు

Paddy Cultivation : ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రతి ఏటా వరి పంటలో నస్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ సమస్యలనుండి గట్టెక్కేందుకు శ్రీకాకుళం జిల్లాలో ప్రకృతి విధానంలో తూర్పు , పడమరలో లైన్ సోయింగ్ వరిసాగును ప్రోత్సహిస్తున్నారు.

Paddy Cultivation : ప్రకృతి విధానంలో లైన్ సోయింగ్ విధానంలో వరి సాగు

Cultivation of Paddy Under Line Sowing System

Updated On : August 20, 2024 / 2:51 PM IST

Paddy Cultivation : ఖరీప్ సీజన్ వరినాట్లు ఊపందుకున్నాయి.  కోందరు రైతులు ఎద పద్దతిలో సాగు చేస్తుంటే..  మరికోందరు సంప్రదాయ పద్దతిలో నాట్లు వేస్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం అధికారులు రైతుల చేత లైన్ సోయింగ్ విధానంలో వరిసాగు చేయిస్తున్నారు. ఈ విధానంలో చీడపీడల తాకిడి తక్కువగా ఉండటంతో.. పెట్టుబడులు తగ్గడమే కాకుండా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. దీంతో చాలామంది రైతులు ఈ విధానంలో సాగుకు మొగ్గుచూపుతున్నారు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

మన దేశంలో అధిక విస్తీరణంలో సాగయ్యే పంట వరి. ఈ పంటను సాగు చెయ్యడానికి మాత్రం అధిక మొత్తంలో నీరు , పోషకాలు అవసరం. అయితే సాధారణంగా ఖరీఫ్ వరికి చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది. వీటిని అరికట్టేందుకు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు పెరిగిన ఎరువులు, కూలీ ఖర్చులతో రైతుకు వరిసాగు భారంగా మారింది.

దీనికి తోడు ప్రకృతి వైపరిత్యాల కారణంగా ప్రతి ఏటా వరి పంటలో నస్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ సమస్యలనుండి గట్టెక్కేందుకు శ్రీకాకుళం జిల్లాలో ప్రకృతి విధానంలో తూర్పు , పడమరలో లైన్ సోయింగ్ వరిసాగును ప్రోత్సహిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా భూసారం పెంచేందుకు ఫ్రీమాన్సూన్ డ్రైసోయింగ్ పద్ధతిలో పచ్చిరొట్ట ఎరువులుగా పలు రకాల నవధాన్యాలను రైతులచేత సాగు చేయిస్తున్నారు. అంతే కాదు సంప్రదాయ పద్ధతిలో కాకుండా క్రమ పద్ధతిలో అంటే తాడు కట్టి లైన్ సోయింగ్ చేయిస్తున్నారు.

లైన్ సోయింగ్ పద్దతిలో వరి సాగు సత్ఫలితాలు ఇస్తుండటంతో.. ఆముదాల వలస మండలం , నిమ్మతొర్లాడ గ్రామ రైతులు పెద్ద ఏత్తున ఈ విధానంలో సాగు మోదలు పెట్టారు .. ఏటువంటి క్రిమిసంహారక మందులు వాడకుండా .. ఆర్గానికి పద్దతిలో లైన్ షోయింగ్ విధానం ద్వారా.. వరినాట్లు వేస్తున్నారు. ఈ విధానం వల చీడపీడలు ఉండవని , అత్యదికంగా దిగుబడితో పాటు పంట పెట్టుబడి ఖర్చు తగ్గుతోందంటున్నారు రైతులు.

Read Also : Turmeric Crop : వరుసగా కురుసిన వర్షాలకు పసుపులో దుంపకుళ్లు ఉధృతి.. నివారణ చర్యలు