Telangana Schools: తెలంగాణ విద్యాశాఖ కీలక ఉత్తర్వులు.. పాఠశాలల పనివేళల్లో మార్పులు

తెలంగాణ పాఠశాలల సమయాల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పని చేయనున్నాయి.

TS School Timings 2023: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాలల పనివేళల్లో మార్పులుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేడీఎస్ఈలకు విద్యాశాఖ పంపించింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్నాయి. గత కొంతకాలంగా పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలని విద్యాశాఖ ఆలోచన చేస్తోంది. కొందరు ప్రజాప్రతినిధులు సూచనల మేరకు విద్యాశాఖ పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

TS School Academic Calendar : ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు సెలవులు, మార్చిలో టెన్త్ పరీక్షలు.. పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్ ఖరారు

రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు మేరకు మంగళవారం నుంచి ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమై. సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగుతాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు కొనసాగుతాయి. ఉన్నత పాఠశాలల సమయాల్లో ఎలాంటి మార్పులు చేయని విద్యాశాఖ.. కేవలం ప్రాథమిక పాఠశాలల సమయాల్లోనే మార్పులు చేసింది. రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో కొన్ని మార్పులు చేయాలని గత కొంతకాలంగా పాఠశాల విద్యాశాఖ ఆలోచన చేస్తోంది.

ప్రస్తుతం ఉదయం 9గంటలకే ప్రాథమిక పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. ప్రాథమిక పాఠశాలల్లో చదివేది చిన్నారులైనందున వారు ఉదయం త్వరగా నిద్రలేవరు. అందువల్ల వారికి ఉదయం 9.30 గంటలకు తరగతులకు మొదలు కావాలి. ఉన్నత పాఠశాలల్లో ఉండేది పెద్ద పిల్లలైనందున ఉదయం 9గంటలకు పాఠశాలలు మొదలు కావాలి. కానీ, అందుకు విరుద్ధంగా ప్రస్తుతం పాఠశాలల ప్రారంభ సమయం ఉండటం.. కొందరు ప్రజాప్రతినిధులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రాథమిక పాఠశాలల సమయాల్లో విద్యాశాఖ మార్పులు చేసింది.

Hyderabad : హైదరాబాద్ శేరిలింగంపల్లిలో భయం భయం.. కూలిన బహుళ అంతస్తుల సెల్లార్ ప్రహరీ గోడ, ఆందోళనలో అపార్ట్‌మెంట్ వాసులు

అయితే, విద్యాశాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వులు జంట నగరాల (హైదరాబాద్ – సికింద్రాబాద్) పరిధిలో మినహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు వర్తిస్తాయి. అయితే, కొందరు తాజా విద్యాశాఖ ఉత్తర్వులను తప్పు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఉదయం 9గంటలలోపే కూలీ పనులకు వెళ్తారని, ఉదయం 9.30 గంటలకు స్కూల్ తెరిస్తే వారికి ఇబ్బంది అవుతుందని పేర్కొంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు