బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. ఆ చట్టం కింద తొలికేసు.. కేటీఆర్ ఫైర్

హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జడ్పీ సీఈవో శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

BRS MLA Padi Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జడ్పీ సీఈవో శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జడ్పీ సమావేశంలో కలెక్టర్ ను అడ్డుకొని, అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గత రెండు రోజుల క్రితం అమల్లోకి వచ్చిన కొత్త చట్టం భారత న్యాయ సంహిత కింద సెక్షన్ 122, 126(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దేశంలో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన రెండోరోజు భారత న్యాయ సంహిత చట్టం కింద ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తొలి కేసు నమోదైంది.

Also Read : క్యాబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ ఫోకస్.. ఆ నలుగురికి ఛాన్స్..! కేటాయించే శాఖలపై ఉత్కంఠ

కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సభలో ఆందోళన పెరుగుతుండటంతో కలెక్టర్ పమేలా సత్పతి తన కుర్చీలో నుంచి లేచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆమె ఎదుట నేలపై బైఠాయించారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే, ఇవాళ ఉదయం కరీంనగర్ నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో జడ్పీ సీఈవో కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read : హత్రాస్ ఘోర విషాదం.. ఎవరీ బోలే బాబా? ఏం చేస్తాడు? ఎలా పాపులర్ అయ్యాడు?

మేము కూడా కేసు పెడతాం
కేసు నమోదుపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ప్రజా గొంతుకగా ప్రజా సమస్యలపై మాట్లాడితే నా గొంతు నొక్కాలనుకుంటే అది మీ వల్ల కాదు. ఎమ్మెల్యేగా రివ్యూ మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు లేదా అంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ కేసులు పెడితే భయపడేది ఏముండదు. నిన్నటి జెడ్పి మీటింగ్ లో హుజురాబాద్ సమస్యలపై అడిగితే తప్పా? నేను ఎవరిని అడ్డుకుంది మీరు చూపివ్వాలి. మేము కూడా మా విధులకు ఆటంకం కలిగించారని కరీంనగర్ వన్ టౌన్ లో కేసు పెడతాం. వారి మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలి. డీఈవో, జడ్పీ సీఈవోపై ప్రివిలైజ్ మూవ్ చేస్తాం. కొత్త చట్టం ప్రకారం ఎట్లాఉంటే అట్ల ముందుకెళ్తాం. మేం కూడా మా న్యాయవాదితో మాట్లాడతామని కౌశిక్ రెడ్డి అన్నారు.

కేటీఆర్ ఫైర్
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేయటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడబోరని చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు