అరే ఏంట్రా బాబు ఇది..! మొబైల్ షాపులో పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. వీడియో వైరల్

హైదరాబాద్ అమీర్ పేట ప్రాంతంలో ఓ మొబైల్ రిపేర్ షాపులో కొందరు వ్యక్తులు వీరంగం సృష్టించారు. షాపు నిర్వాహకుడితోపాటు, షాపులోని సిబ్బందిపై దాడికి దిగారు.

Hyderabad : హైదరాబాద్ అమీర్ పేట ప్రాంతంలో ఓ మొబైల్ రిపేర్ షాపులో కొందరు వ్యక్తులు వీరంగం సృష్టించారు. షాపు నిర్వాహకుడితోపాటు, షాపులోని సిబ్బందిపై దాడికి దిగారు. దీంతో షాపు సిబ్బందిసైతం ప్రతిఘటించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో పొట్లాట జరిగింది. చేతికి అందిన వస్తువులను ఒకరిపై ఒకరు విసిరేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అరే ఏంట్రా బాబు ఇది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మరో కీలక బాధ్యత.. ఈసారి ఇంటింటి సర్వే!

పాత బకాయిలు అడిగినందుకు కూకట్ పల్లికి చెందిన అఖిల్ అనే వ్యక్తి మొబైల్ రిపేర్ షాపు నిర్వాహకుడిపై ఘర్షణకు దిగాడు. వీరి మధ్య మాటామాటా పెరగడంతో అఖిల్ తన అనుచరులతో కలిసి షాపు నిర్వాహకుడు, సిబ్బందిపై దాడి చేశాడు. వారిపై విచక్షణారహితంగా దాడిచేయడంతోపాటు షాపులోని సామాగ్రిని ధ్వంసం చేశారు. అఖిల్, అతని అనుచరులను అడ్డుకునేందుకు షాపు నిర్వాహకుడు, సిబ్బంది ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య కోట్లాట జరిగింది. స్థానికుల సమాచారంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని షాపు నిర్వాహకుడుపై దాడిచేసి అఖిల్ సహా ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. షాపుపై దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ పుటేజ్ లలో రికార్డు కావటంతో వాటిని ఆధారంగా పోలీసులు నిందితులపై చర్యలు తీసుకున్నారు.

Also Read : David Miller : టీ20 ఫార్మాట్ కు డేవిడ్ మిల్లర్ రిటైర్మెంట్..? షాకింగ్ విషయం ఏమిటంటే..

 

ట్రెండింగ్ వార్తలు