Vijay Deverakonda : ఆహా స్టేజిపై చిన్న పిల్లాడితో క్రికెట్ ఆడిన విజయ్ దేవరకొండ..

తాజాగా విజయ్ దేవరకొండ ఆహా ఓటీటీలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి గెస్ట్ గా వచ్చారు.

  • Updated on- July 4, 2024 / 09:09 AM IST

Vijay Deverakonda comes as Guest for Aha Telugu Indian Idol Season 3 Latest Episode

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఇటీవలే కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం తన రాబోయే సినిమాల షూట్ తో బిజీగా ఉన్నారు. విజయ్ చేతిలో ప్రతుతం మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ ఆహా ఓటీటీలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి గెస్ట్ గా వచ్చారు.

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేసారు. విజయ్ దేవరకొండ ఈ ఎపిసోడ్ లో ఫుల్ సందడి చేసినట్టు తెలుస్తుంది. విజయ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాక సింగర్ కార్తీక్.. పండగలకు చేస్తారు సెలబ్రేషన్.. విజయ్ దేవరకొండ అంటేనే సెన్సేషన్ అంటూ హైప్ ఇచ్చాడు. దీంతో కాసేపు విజయ్, జడ్జీలు థమన్, కార్తిక్, గీతా మాధురిల మధ్య కామెడీ నడిచింది. కంటెస్టెంట్స్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ మైక్ ఎందుకు అలా పట్టుకుంటాడు? చిన్న పాప రీల్‌కి రిప్లై ఇచ్చిన విజయ్..

ఓ లేడీ కంటెస్టెంట్ సోదరుడు స్టేజిపైకి రాగా ఆ బాబుతో విజయ్ దేవరకొండ కామెడీ చేసి క్రికెట్ కూడా ఆడాడు. కంటెస్టెంట్ స్కంద విజయ్ దేవరకొండ గీతగోవిందం సినిమాలో సాంగ్ పాడి మెప్పించాడు. ఆ కంటెస్టెంట్ తల్లి స్టేజిపైకి రాగా ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ.. దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి మనకు అమ్మలను ఇచ్చినందుకు. మా అమ్మ నువ్వుతూ హ్యాపీగా ఉంటే నేను అన్ని ఆపేసి అలాగే చూస్తుంట అని అన్నాడు.

ఇక కేశవ్ అనే కంటెస్టెంట్ పాడిన పర్ఫార్మెన్స్ కి సింగర్ కార్తిక్ నువ్వు నా బ్యాండ్ లో జాయిన్ అవుతావా అంటూ ఆఫర్ ఇచ్చాడు. అలాగే తన పేరెంట్స్ వీడియో మెసేజ్ తెప్పించి విజయ్ అతన్ని సర్ ప్రైజ్ చేసాడు. మరో కంటెస్టెంట్ మణిశర్మ కంపోజ్ చేసిన సాంగ్ బాగా పాడటంతో ఈ పర్ఫార్మెన్స్ మణిశర్మ గారికి పంపిస్తాను అని తమన్ చెప్పాడు. విజయ్ దేవరకొండ వచ్చి సందడి చేయడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..

https://www.youtube.com/watch?v=cCQeeflbZuI