Vijay Deverakonda : విజయ్ దేవరకొండ మైక్ ఎందుకు అలా పట్టుకుంటాడు? చిన్న పాప రీల్‌కి రిప్లై ఇచ్చిన విజయ్..

అందరు మైక్ ని స్ట్రైట్ గా పట్టుకుంటే విజయ్ పక్కకు పట్టుకొని మాట్లాడతాడు. తాజాగా దీనిపై ఓ చిన్నపాప ఇన్‌స్టాగ్రామ్ లో రీల్ చేసింది.

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ మైక్ ఎందుకు అలా పట్టుకుంటాడు? చిన్న పాప రీల్‌కి రిప్లై ఇచ్చిన విజయ్..

Vijay Deverakonda gives Reply to a Cute Small Girl Instagram Reel Video goes Viral

Vijay Deverakonda : విజయ్ దేవరకొండకి ప్రస్తుతం యూత్ లో, పిల్లల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చి పర్వాలేదనిపించిన విజయ్ త్వరలో మూడు భారీ పాన్ ఇండియా సినిమాలతో రాబోతున్నాడు. రీసెంట్ గా కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి మెప్పించాడు. ఇక విజయ్ ఈవెంట్స్ లో స్టైలిష్ గా మాట్లాడతాడని తెలిసిందే. ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా, ఫార్మాలిటీస్ పట్టించుకోకుండా తనకి ఇష్టమొచ్చినట్టు స్టేజిపై మాట్లాడతాడు విజయ్.

విజయ్ స్పీచ్ లకు, మాట్లాడే విధానానికి కూడా యూత్ లో కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అందరు మైక్ ని స్ట్రైట్ గా పట్టుకుంటే విజయ్ పక్కకు పట్టుకొని మాట్లాడతాడు. తాజాగా దీనిపై ఓ చిన్నపాప ఇన్‌స్టాగ్రామ్ లో రీల్ చేసింది. ఆర్య అనే చిన్న పాప తాను చేసిన రీల్ లో.. విజయ్ దేవరకొండ మైక్ ఎందుకు ఇలా పట్టుకుంటాడు, అతనికి బిర్యానీ ఇష్టమా ఎందుకంటే లెగ్ పీస్ ఇలాగే పట్టుకొని తింటారు కదా అని మైక్ పట్టుకొని చూపిస్తూ క్యూట్ గా అడిగింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో విజయ్ దేవరకొండ దీనికి రిప్లై ఇచ్చాడు.

Also Read : Venu Swamy – Bigg Boss : తెలుగు బిగ్‌బాస్‌ 8లో వేణుస్వామి ఫిక్స్..? భారీగానే పారితోషికం..?

ఈ క్యూట్ రీల్ కి విజయ్ దేవరకొండ రిప్లై ఇస్తూ.. నాకు బిర్యానీ విపరీతంగా ఇష్టం ఆర్య. మైక్ అలా ఎందుకు పట్టుకున్నానో తెలీదు. నాకు అడ్డు రాకుండా కంఫర్టబుల్ ఉంటుంది అని అనుకుంట అని సమాధానం ఇచ్చాడు. ఇంకేముంది విజయ్ కామెంట్, ఈ రీల్ మరింత వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఈ క్యూట్ రీల్ చూసేయండి..