Venu Swamy – Bigg Boss : తెలుగు బిగ్‌బాస్‌ 8లో వేణుస్వామి ఫిక్స్..? భారీగానే పారితోషికం..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 త్వరలోనే మొదలవ్వబోతుందని సమాచారం. ఆగస్టు చివర్లో ఈ షో స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఆల్రెడీ కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి.

Venu Swamy – Bigg Boss : తెలుగు బిగ్‌బాస్‌ 8లో వేణుస్వామి ఫిక్స్..? భారీగానే పారితోషికం..?

Famous Astrologer Venuswami will entry into Telugu BiggBoss Season 8 Rumours goes Viral

Venu Swamy – Bigg Boss : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 త్వరలోనే మొదలవ్వబోతుందని సమాచారం. ఆగస్టు చివర్లో ఈ షో స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఆల్రెడీ కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ మొదలయ్యే నెల, రెండు నెలల ముందు నుంచే ఎవరెవర్ని తీసుకోబోతారో వాళ్ళని అప్రోచ్ అవ్వడం, మాట్లాడటం జరుగుతుంది. దీంతో 8వ సీజన్ కి కూడా ఇప్పటికే బర్రెలక్క, కుమారి ఆంటీ, హీరో రాజ్ తరుణ్, యాంకర్ రీతూ చౌదరి.. ఇలా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు కూడా అవినిపిస్తుంది. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల మీద ఎక్కువగా జ్యోతిష్యం ఓ పక్క వైరల్ అవుతూనే మరో పక్క వివాదాల్లో నిలిచారు ఈయన. వేణు స్వామి చెప్పినవి కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు. దీంతో వేణుస్వామి ఇటీవల ఇకపై జ్యోతిష్యం చెప్పను అని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే వేణుస్వామి వద్దకు అనేకమంది హీరోయిన్స్, సినిమా సెలబ్రిటీలు వెళ్లి మరీ పూజలు చేయించుకోవడంతో వాళ్ళు కూడా బాగానే పాపులర్ అయ్యారు.

Also Read : Pawan Kalyan : సినిమాల్లో న‌టించ‌డం పై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

దీంతో వేణుస్వామి పాపులారిటీని బిగ్ బాస్ వాడుకోవాలనుకుంటుంది. ఇప్పటికే వేణుస్వామిని సంప్రదించినట్టు, భారీగా అమౌంట్ ఆఫర్ చేసినట్టు, ఇందుకు వేణుస్వామి కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. వేణుస్వామి వస్తే టీవీలో టీఆర్పీ రేటింగ్ కూడా బాగానే పెరుగుతుందని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. మరి హౌస్ లోకి వచ్చి ఇక్కడ ఎవరి జాతకాలు చెప్తారో, ఎవరి గురించి మాట్లాడతారో, బిగ్ బాస్ నుంచి ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.