Pawan Kalyan : సినిమాల్లో నటించడం పై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
పిఠాపురంలో నిర్వహించిన సభలో సినిమాల్లో నటించడం పై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Pawankalyan interesting comments on his movie shootings
జనసేన అధినేత, టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఓవైపు అధికారులతో వరుస సమీక్షలు చేస్తూనే మరోవైపు ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పిఠాపురంలో నిర్వహించిన సభలో సినిమాల్లో నటించడం పై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉంటానని చెప్పారు.
సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతుంటే.. మధ్యలో అందరూ ఓజీ.. ఓజీ అంటూ అరుస్తూ ఉన్నారు. వారు ఏమని అంటున్నారో మొదట పవన్ అర్థం కాలేదు. పక్కనే ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తనదైన శైలిలో ఫన్నీగా ఓజీ సినిమానా..? అని అన్నారు. దీంతో అతడి వారు కేరింతలు కొట్టారు.
ఆ వెంటనే పవన్ మాట్లాడుతూ.. ఇప్పుడు సినిమాలు తీసే సమయం ఉందని అంటారా..? అంటూ ప్రశ్నించారు. మీకు మాటిచ్చాను కాబట్టి మూడు నెలల పాటు సినిమా షూటింగ్స్‌లు చేయను. ఏపీలో గుంతలు పూడ్చి, రోడ్డు వేసిన తరువాత షూటింగ్‌కు వెళతాను అని అన్నారు. వీలుకుదిరినప్పుడు 2 లేదా 3 మూడు రోజులు షూటింగ్స్ వెళతానని చెప్పారు. ఈ విషయం ఇప్పటికే నిర్మాతలకు చెప్పానన్నారు. క్షమించాలి.. మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సేవ చేసి వారంలో రెండు రోజులు షూటింగ్ చేస్తా అని అన్నట్లుగా పవన్ చెప్పారు. ఓజీ సినిమా బాగుంటుంది.. మీరు చూద్దురు గానీ అని పవన్ అన్నారు.
ఈ లెక్కన పవన్ కల్యాణ్ షూటింగ్‌లో జాయిన్ కావాలంటే మరో మూడు నెలలు ఆగాల్సిందే. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్‌ను పవన్ పూర్తి చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆయా సినిమాల షూటింగ్ వాయిదా పడింది.
SVC 58 : వెంకటేశ్ అనీల్ రావిపూడి సినిమా మొదలు.. సంక్రాంతి బరిలో.. !
ఉప్పాడ బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన సినిమాల గురించి అభిమానులతో…! pic.twitter.com/YzJBtyegFy
— L.VENUGOPAL? (@venupro) July 3, 2024