35 Chinna Katha Kaadu Teaser : ’35-చిన్న కథ కాదు’ టీజర్.. కొడుకును పాస్ చేసేందుకు నివేదా కష్టాలు..!
మలయాళ ముద్దు గుమ్మ నివేదా థామస్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది.

Nivetha Thomas 35 Chinna Katha Kaadu Movie Official Teaser
మలయాళ ముద్దు గుమ్మ నివేదా థామస్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. కొంత గ్యాప్ తరువాత ఆమె నటిస్తున్న మూవీ ’35 – చిన్న కథ కాదు’. నందకిషోర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రియదర్శి, విశ్వ కీలక పాత్రల్లో నటిస్తుండగా రానా దగ్గుబాటి నిర్మిస్తున్నారు. టైటిల్‌తోనే అందరిని ఆకట్టుకున్న ఈ మూవీ, ఫస్ట్ లుక్ పోస్టర్‌నూ మెప్పించింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
ఇందులో నివేదా థామస్ ఓ మధ్య తరగతి గృహిణి పాత్రలో కనిపిస్తోంది. కొడుకు చదువులో వెనుబడడంతో తనలాగా ఫెయిల్ కాకూడని, పాస్ మార్కులు తెచ్చుకోవాలని టీచర్లు చెప్పడంతో ఆ తల్లి ఏం చేసిందనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కినట్లుగా టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. నివేదా థామస్ యాక్టింగ్ అదిరిపోయింది.
SVC 58 : వెంకటేశ్ అనీల్ రావిపూడి సినిమా మొదలు.. సంక్రాంతి బరిలో.. !
వివేక్ సాగర్ అందించిన బీజీఎం చాలా బాగుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 15న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.