Chiranjeevi : చిరంజీవి ఇంట్లో కీరవాణి పాటల కచేరి.. పాతరోజులు గుర్తొచ్చాయంటూ స్పెషల్ వీడియో షేర్ చేసిన మెగాస్టార్..

చిరంజీవి ఇంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అతని టీమ్ తో విశ్వంభర మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టారు.

Chiranjeevi shares a Special Video of MM Keeravani from Music Settings of Vishwambhara at Chiranjeevi Home

Chiranjeevi – MM Keeravani : చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వశిష్ఠ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే గతంలో సినిమాలకు ముందు పాటలతోనే పని మొదలుపెట్టేవాళ్ళు. విశ్వంభరకు కూడా మళ్ళీ అలాగే పాటలతోనే పని మొదలుపెట్టారు. నేడు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన వాయిస్ ఓవర్ తో ఓ స్పెషల్ వీడియో షేర్ చేసాడు.

గతంలో సినిమాలకు సంగీత దర్శకుడు ఆధ్వర్యంలో అందరూ మూవీ టీమ్ కూర్చొని పాటల డిస్కర్షన్ చేసుకొని ఫైనల్ చేసేవారు. ఇప్పుడు అలా జరగట్లేదు. విశ్వంభర సినిమాకు మళ్ళీ ఆ ఆనవాయితీ తీసుకొచ్చారు. చిరంజీవి ఇంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అతని టీమ్ తో విశ్వంభర మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టారు. ఈ మ్యూజిక్ సెట్టింగ్స్ లో చిరంజీవి, డైరెక్టర్ వసిష్ఠ, నిర్మాత అందరూ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసారు చిరంజీవి.

Also Read : Vijay Deverakonda : ఆహా స్టేజిపై చిన్న పిల్లాడితో క్రికెట్ ఆడిన విజయ్ దేవరకొండ..

ఈ వీడియోలో సరదాగా కీరవాణితో సంగీతం కంపోజ్ చేస్తూ ముచ్చటిస్తున్నారు. అలాగే చిరంజీవి ఆపద్భాంధవుడు సినిమాలోని ఓ సూపర్ హిట్ సాంగ్ ని కీరవాణి అక్కడే కంపోజ్ చేస్తూ పాడారు. చిరు కూడా ఎంజాయ్ చేస్తూ ఆ సంగీత కచేరీని ఆస్వాదించారు. ఈ వీడియో షేర్ చేసి మా ఆస్కారుడు MM కీరవాణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఇలా సంగీత చర్చలు చేస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి అని చిరంజీవి తన వాయిస్ తో వీడియోలో తెలిపారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. వీడియోలో కీరవాణి మ్యూజిక్ తో పాడుతుంటే చిరంజీవి చిన్నపిల్లాడిలా ఏంజాయ్ చేస్తుంటే ఎంతో బాగుంది అని భిమానులు అంటున్నారు. ఈ వీడియో మీరు కూడా చూసేయండి..