Telugu Film Production: అప్ కమింగ్ హీరోలకు లిఫ్ట్ ఇస్తున్న స్టార్ ప్రొడ్యూసర్స్!

నానా కష్టాలు పడి సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకుంటున్నారు. సినిమాలు ఎంత సక్సెస్ అయినా, ఎంత టాలెంట్ ఉన్న.. నెక్ట్స్ సినిమా చెయ్యడానికి ప్రొడ్యూసర్లు కావాలి. అందుకే ఈ మధ్య..

Telugu Film Production: నానా కష్టాలు పడి సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకుంటున్నారు. సినిమాలు ఎంత సక్సెస్ అయినా, ఎంత టాలెంట్ ఉన్న.. నెక్ట్స్ సినిమా చెయ్యడానికి ప్రొడ్యూసర్లు కావాలి. అందుకే ఈ మధ్య సక్సెస్ లో ఉన్న హీరోలకు లిప్ట్ ఇస్తున్నాయి స్టార్ ప్రొడక్షన్ హౌజ్ లు. టాలెంట్ ని గుర్తిస్తూ.. ఎంకరేజ్ చేస్తూ ప్రొడక్షన్ హౌజ్ లు అవకాశాలిస్తున్నాయి. చిన్న హీరోలు, అప్ కమింగ్ హీరోలు ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత సక్సెస్ కోసం ట్రై చేస్తున్నా.. కరెక్ట్ బ్యానర్ లో సినిమా పడితే ఆ గుర్తింపే వేరు. అందుకే ఈ మధ్య అప్ కమింగ్ హీరోలు.. పెద్ద బ్యానర్ల దృష్టిలో పడేలా సినిమాలు చేస్తున్నారు.

Summer Movies Release: ఏప్రిల్ వార్.. ఈసారి ఎవరు అడ్డొచ్చినా తగ్గేదే లే!

కష్టపడుతున్నారు కదా అని పెద్ద బ్యానర్లు కూడా అప్ కమింగ్ హీరోలకు సినిమా అవకాశాలు ఇస్తున్నాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ సిద్దు జొన్నల గడ్డతో డి.జె టిల్లు అనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ రెడీ చేసి సంక్రాంతి బరిలోకి దింపుతున్నారు. లేటెస్ట్ గా గీతా ఆర్ట్స్ జస్ట్ 6 సినిమాలు చేసిన కిరణ్ అబ్బవరంతో సినిమా స్టార్ట్ చేశారు. సెబాస్టియన్, ఎస్.ఆర్ కళ్యాణ మండపం లాంటి డిఫరెంట్ మూవీస్ చేస్తున్న కిరణ్.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వినరో భాగ్యము విష్ణు కథ సినిమా చేసే ఛాన్స్ దక్కించుకుని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

Netflix-Prime Video: మాటకు మాట.. నెట్‌ఫ్లిక్స్-ప్రైమ్ వీడియో ట్విట్టర్ వార్!

పుష్ప లాంటి భారీ సక్సెస్ లు కొడుతూనే మరోవైపు అప్ కమింగ్ అండర్ రేటెడ్ హీరోస్ కి ఛాన్సిస్తోంది మైత్రి మూవీ మేకర్స్. సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా మైత్రి మూవీస్ లోనే రెడీ అవుతోంది. ఇక దిల్ రాజు బ్యానర్ లో ఈమధ్య సౌత్ తో పాటు నార్త్ మూవీస్ కూడా తెరకెక్కుతున్నాయి. లేటెస్ట్ గా విష్వక్ సేన్ తో ఓరిదేవుడా అనే ఇంట్రస్టింగ్ మూవీ చేస్తోంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.

ట్రెండింగ్ వార్తలు