చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు? ఏమైపోయారు? రాష్ట్ర ప్రజలకు తెలియాలి- మంత్రి జోగి రమేశ్

భారీ మెజారిటీతో సీఎంగా జగన్ మరోసారి అధికారం చేపట్టబోతున్నారు. జూన్ 4 న కూటమిని ప్రజలు సమాధి చేస్తారు.

Jogi Ramesh : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎక్కడికి వెళ్ళారు? ఏమైపోయారు? అని మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు. చంద్రబాబు ఏ దేశానికి పారిపోయారనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు టీడీపీ నేతలకు కూడా చంద్రబాబు ఎక్కడ ఉన్నారో తెలియదన్నారు. విదేశీ పర్యటనకు అంటే ఎక్కడికి వెళ్లినట్లు అని ప్రశ్నించారు. చంద్రబాబు దోచిన డబ్బులు దుబాయ్ లో దాయటానికి వెళ్లారా? అని నిలదీశారు. త్వరలో టీడీపీ అడ్రస్ గల్లంతు అవుతుంది, టీడీపీ నేతల నోటికి తాళాలు పడతాయని మంత్రి జోగి రమేశ్ అన్నారు. కూటమి కుప్పకూలిపోతుందని చెప్పారు.

”టీడీపీ అధ్యక్షుడే పారిపోయారు అంటే మా గతి ఏంటని ఆ పార్టీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు. చంద్రబాబు దుబాయ్ వెళ్ళారా? ఇటలీ వెళ్ళారా? అమెరికా వెళ్ళారా? ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళారో రాష్ట్ర ప్రజలకి తెలియాలి. విలువలకు విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టబోతున్నారు.
జగన్ వైపు రాష్ట్ర ప్రజలు నిలబడ్డారు.

కూటమి నేతలు కుట్రలు చేసి ఎన్నికల్లో కలిసి వచ్చారు. విలువలు విశ్వసనీయత లేని కూటమిని తన్ని తరిమి కొడతారు. జూన్ 4 న కూటమిని ప్రజలు సమాధి చేస్తారు. కూటమి దత్త పుత్రుడు ఏమయ్యారో తెలీదు. భారీ మెజారిటీతో సీఎంగా జగన్ మరోసారి అధికారం చేపట్టబోతున్నారు. ఎన్నికల కమిషన్ ను అడ్డం పెట్టుకొని కుట్రలు కుతంత్రాలు చేశారు. అధికారులను బదిలీ చేసిన చోటే అల్లర్లు జరిగాయి. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఎస్సీ ఎస్టీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.

పెనమలూరులో వైసీపీకి మళ్ళీ పట్టం కడతారు. బాధ్యత కలిగిన నాయకుడిగా చంద్రబాబు చేసే పనేనా ఇది? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పే బాధ్యత చంద్రబాబుకు లేదా? అసలు చంద్రబాబు ఎక్కడ ఉన్నారు? ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు?” అని మంత్రి జోగి రమేశ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read : ఏపీలో సిట్ వేస్ట్.. జగన్, చంద్రబాబుకు బాధ్యత లేదా? : సీపీఐ నారాయణ

ట్రెండింగ్ వార్తలు