Anand Deverakonda : టాలీవుడ్‌లో ఎవరైనా ఏదైనా సాధిస్తే కొన్ని గ్రూప్స్ మాత్రమే సెలబ్రేట్ చేస్తున్నాయి.. ఆనంద్ సంచలన వ్యాఖ్యలు..

‘గం గం గణేశా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Anand Deverakonda Sensational Comments on Tollywood in Gam Gam Ganesha Trailer Launch Event

Anand Deverakonda : విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి డిఫరెంట్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్ దేవరకొండ. మే 31న ‘గం గం గణేశా’ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ‘గం గం గణేశా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ఇటీవల సినీ పరిశ్రమలో, బయట కంపారిజాన్స్, కాంపిటీషన్స్ పెరిగిపోయాయి. సినిమాల కలెక్షన్స్ హీరోల గురించి కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. అలాగే మన పరిశ్రమని వేరే పరిశ్రమలతో కంపేర్ చేస్తున్నారు ఇది ఒక నెగిటివ్ వైబ్ ఇస్తుంది. ఈ కంపారిజాన్ లో సినిమాల సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవట్లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది చాలా నెగిటివ్ గా మారుతుంది. కొంతమంది తెలుగు సినిమాలను వేరే పరిశ్రమలతో కంపేర్ చేసి మంచి సినిమాలు చెయ్యట్లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ తెలుగులోనే మంచి సినిమాలు వస్తున్నాయి అని అన్నారు.

Also Read : Anand Deverakonda : సినిమా కోసం ఆనంద్ దేవరకొండ మెడపై టాటూ.. మీనింగ్ ఏంటో తెలుసా?

అలాగే సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. రీసెంట్ గా డైరెక్టర్స్ డే చేశారు. డైరెక్టర్స్ అందరికి నా కంగ్రాట్స్. ఇలా అందరూ కలిసి చేయడం చాలా మంచిది. హీరోల పేరు మీద సినిమాలు నడుస్తున్నాయి కానీ డైరెక్టర్స్ ది సినిమా. సినీ పరిశ్రమ అంతా ఒక ఫ్యామిలీ. ఎవరికైనా ఏదైనా సాధిస్తే అందరం కుటుంబంలాగా సెలబ్రేట్ చేయాలి కానీ కొన్ని గ్రూప్స్ గా మాత్రమే సెలబ్రేట్ చేస్తున్నారు. అందరం కలిసి సెలబ్రేట్ చెయ్యట్లేదు, ఎవరికి వాళ్ళు వాళ్లదే సక్సెస్ అనుకుంటున్నారు అని వ్యాఖ్యలు చేశారు.

మరి ఆనంద్ దేవరకొండ ఎవరి సక్సెస్ ని, ఎవరి సెలబ్రేషన్స్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసాడో కానీ టాలీవుడ్ లో ఈ వ్యాఖ్యలు చర్చగా మారాయి. మరి దీనిపై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు