Corona Vaccine : కరోనా వ్యాక్సిన్ తో డయాలసిస్ రోగుల్లో ఇన్‌ఫెక్షన్ ముప్పు తగ్గుదల

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డయాలసిస్‌ రోగుల్లో ఇన్‌ఫెక్షన్‌ ముప్పు 33 శాతం తగ్గినట్లు అధ్యయనంలో తేలింది. ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

infection risk in dialysis patients : కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను విణికిస్తోన్న విషయం తెలిసిందే. వైరస్ కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సిన్ వేయించుకున్న మూత్ర పిండాల రోగులకు రక్షణ కలుగనుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డయాలసిస్‌ రోగుల్లో ఇన్‌ఫెక్షన్‌ ముప్పు 33 శాతం తగ్గినట్లు అధ్యయనంలో తేలింది. డయాలసిస్‌ నెట్‌వర్క్‌ సంస్థ ‘నెఫ్రోప్లస్‌’ దేశవ్యాప్తంగా 150 పట్టణాలు, నగరాల్లో 32,235 మంది డయాలసిస్‌ రోగులపై ఇటీవల అధ్యయనం చేసి గురువారం నివేదికను వెల్లడించింది.

సాధారణ ప్రజల్లో కరోనా వ్యాప్తి రేటు 0.44 శాతం ఉండగా డయాలసిస్‌ రోగుల్లో 8.7 శాతం ఉన్నట్లు నెఫ్రోప్లస్‌ పేర్కొంది. కరోనా కారణంగా డయాలసిస్‌ రోగుల మరణాలు మొదటి దశ ఉద్ధృతిలో 5శాతం పెరిగినట్లు గుర్తించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ లో చాలా మంది ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోవడంతో ప్రాణాలతో బయట పడ్డారని తెలిపారు.

Hayat Nagar : హయత్ నగర్ లో మహిళ మృతదేహం కలకలం

బీపీ, షుగర్‌, మూత్రపిండాల వైఫల్యం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవడం అనివార్యమని స్పష్టం చేశారు. ఒకవేళ కరోనా బారిన పడినా.. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ ముప్పు తప్పుతుందన్నారు. ఒక డోసు తీసుకున్న వారు సైతం ముప్పు నుంచి బయట పడినట్లు అధ్యయనంలో గుర్తించినట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు.

ట్రెండింగ్ వార్తలు