Green Manure Cultivation : పచ్చిరొట్ట పైర్ల సాగుతో పెరగనున్న భూసారం.. దిగుబడులు పెరిగే అవకాశం

పచ్చిరొట్ట ఎరువుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. పప్పుజాతి పంటలైన ఈ మొక్కల వేర్లలో రైజోబియం బుడిపెలు వుంటాయి. ఇవి గాలిలోని నత్రజనిని గ్రహించి ఈ బుడిపెలలో నిక్షిప్తం చేస్తాయి. వీటిని భూమిలో కలియదున్నినప్పుడు, భూమి గుల్లగా మారి, నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది.

Green Manure Cultivation : మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూమిలో సేంద్రీయ కర్బనం తగ్గిపోయి చౌడుశాతం పెరిగిపోతోంది. పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది. ఎంత పెట్టుబడి పెట్టినా, దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీలుగ, జనుము పిల్లిపెసర పచ్చిరొట్ట పంటలను పెంచి నేలలో కలియదున్నడం ద్వారా భూసారం పెంచుకోవచ్చు. పశువుల ఎరువు లభ్యత తక్కువగా వున్న ప్రస్థుత పరిస్థితుల్లో, పచ్చిరొట్ట పైర్ల సాగు రైతుకు సులభమైన మార్గం. ప్రస్థుతం వీటి సాగుకు అనువైన సమయం. వివరాలు చూద్దాం.

READ ALSO : Varieties of Paddy : ముంపును తట్టుకునే నూతన వరి రకం

సేద్యంలో రైతు పూర్తిగా రసాయనిక ఎరువుల పైనే ఆధారపడటం వల్ల సాగులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సేంద్రీయ ఎరువులు వాడక పోవటం వల్ల భూ సారం తగ్గి , దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. పెట్టుబడి భారం పెరుగుతోంది. ఈసమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను రుతుపవనాల ఆరంభంలో వేసుకోవాలి. అవకాశాన్నిబట్టి మే నెలలో ఈ పైర్లను వేసుకుంటే భూసారాన్ని పెంచుకునే వీలుంది. అంతే కాకుండా, వర్షాకాలంలో భూమి కోతకు గురి కాకుండా అరికట్టవచ్చు. భూమిలో తేమ, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు

పచ్చిరొట్ట ఎరువుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. పప్పుజాతి పంటలైన ఈ మొక్కల వేర్లలో రైజోబియం బుడిపెలు వుంటాయి. ఇవి గాలిలోని నత్రజనిని గ్రహించి ఈ బుడిపెలలో నిక్షిప్తం చేస్తాయి. వీటిని భూమిలో కలియదున్నినప్పుడు, భూమి గుల్లగా మారి, నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. పంటల నాణ్యతతో పాటు చీడపీడల నుండి తట్టుకునే శక్తి పెరుగుతుంది. సారవంతమైన నేలలను పాలచౌడు, కారుచౌడు నేలలుగా మారకుండా నివారిస్తుంది. పంట దిగుబడి 15 నుండి 20 శాతం అధికంగా పెరుగుతుంది.

READ ALSO : Machinery In Agriculture : వ్యవసాయంలో యంత్రాల వినియోగంతో ఖర్చు తక్కువ, సమయం అదా!

తేలికగా చివికి నేల సత్తువ పెంచే వాటిని పచ్చిరొట్ట ఎరువులు అంటారు. పచ్చిరొట్ట ఎరువులను రెండు రకాలుగా పైరుకు అందించవచ్చు. పచ్చిరొట్ట ఎరువు, పచ్చిఆకు ఎరువుగా నేలకు అందించవచ్చు. ఎరువు కోసం ఒక పైరును ప్రత్యేకంగా సాగుచేసి పూత వచ్చేదశలో భూమిలో కలియదున్ని తగినంత నీరుపెట్టి కుళ్ళనివ్వాలి. తర్వాత పండించే పంట వేసే సమయానికి బాగా కుళ్లి ఎరువుగా మారుతుంది. పప్పుజాతి పైర్లు అయిన జీలుగ, జనుము, పిల్లిపెసర , అలసంద వంటి పైర్లు బాగా పనికి వస్తాయి. జింకు, నత్రజనిని, సూపర్‌పొటాస్‌అందుతుంది. పంట లో తుంగ, గరిక వంటి కలుపు మొక్కలను అడ్డుకుంటాయి.

READ ALSO : Mixed Farming : రైతుకు భరోసానిస్తున్న మిశ్రమ వ్యవసాయం.. పలు పంటల సాగు విధానంతో స్థిరమైన ఆర్థిక వృద్ధి

పచ్చిరొట్ట ఎరువులు వేసిన తర్వాత నేలలో వేసి కలియదున్నడానికి సుమారు 45 రోజుల వ్యవధి కావాలి. ఏపుగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టను ఇవ్వాలంటే తేమ అవసరమవుతుంది. వీటిని రైతులు సకాలంలో పొలంలో సాగుచేసి కలియదున్నడంతో ఎరువులపై పెట్టే ఖర్చులు తగ్గడమే కాకుండా, అధిక దిగుబడులను పొందవచ్చని తెలంగాణ వ్యవసాయ విశ్వ విధ్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డా. మంతటి గోవర్ధన్ చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం క్రింది వీడియోపై క్లిక్ చేయండి.

ట్రెండింగ్ వార్తలు