Hat Cause Hair Loss : క్యాప్ పెట్టుకుంటే జుట్టు రాలిపోవడం నిజమేనా?

ఎండగా ఉన్నప్పుడు.. బైక్‌లు నడిపేటపుడు, స్టైల్ లుక్ కోసం చాలామంది క్యాప్‌లు ధరిస్తారు. క్యాప్‌లు ఎక్కువగా ధరించడం వల్ల జుట్టు రాలిపోతుందని అంటారు. అయితే అందులో వాస్తవమెంత?

Hat Cause Hair Loss

Hat Cause Hair Loss : చాలామంది ఎండలో టోపీ పెట్టుకుంటారు. బైక్ మీద వెళ్లేవారు కూడా క్యాప్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు. స్టైల్‌ కోసం కూడా క్యాప్ పెట్టుకుంటారు. అయితే క్యాప్ అతిగా వాడితే జుట్టు రాలిపోతుందని, బట్టతల వచ్చేస్తుందనే అపోహలు ఉన్నాయి. అయితే వీటిలో వాస్తవమెంత?

Ginger For Healthy Hair : ఆరోగ్యకరమైన జుట్టు కోసం అల్లం ! జుట్టు పెరుగుదలలో దాని అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే..

క్యాప్ పెట్టుకోవడం వల్ల ఎక్కువగా జుట్టు ఊడిపోతోందా? క్యాప్‌కి జుట్టు ఊడటానికి సంబంధం ఉందనే శాస్త్రీయ మైన ఆధారాలు లేవు. అయితే క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ జాన్ ప్రకారం చాలా బిగుతుగా టోపీలను ధరించడం వల్ల వెంట్రుకల కుదుళ్లకు రక్త ప్రసరణ తగ్గుతుందని చెప్పారు. దాంతో కుదుళ్లపై ఒత్తిడి ఏర్పడి అవి రాలిపోతాయట. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. వయసు, వారసత్వం, హార్మోన్ల మార్పులు, ఏదైనా మందులు వాడటం వంటివి కూడా కారణం కావచ్చు. ఇంకా ఆండ్రోజెనిక్ అలోపేసియా దీనినే బట్టతలగా చెబుతారు. దీనిపై అనేక పరిశోధనలు జరిగాయి. అయితే టోపీ పెట్టుకోవడం వల్ల బట్టతల వస్తుందని కూడా ఏ పరిశోధన చెప్పలేదు.

 

మేయో క్లినిక్ ప్రకారం మగ, ఆగవారు సాధారణంగా రోజుకు 100 వెంట్రుకలు కోల్పోతారట. ఇది చాలా సహజమని, ఆరోగ్యకరమైనదే అని చెప్పారు. అయితే జుట్టు రాలినపుడు జుట్టు పెరగకపోవడం అనే అసమతౌల్యం ఏర్పడినప్పుడు జుట్టును కోల్పోవడం జరుగుతుంది. హెయిర్ ఫోలికల్స్ పాడైనపుడు కూడా జుట్టు రాలుతుంది. ఇక జుట్టు రాలడం అనేది ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ బట్టి కూడా ఉంటుంది. చిన్న వయసులోనే జన్యుపరంగా కూడా జుట్టు రాలడం మొదలౌతుంది. మగవారు నుదుటిపైన లేదా తలపైన వెంట్రుకలు కోల్పోవడంతో బట్టతల ఏర్పడుతుంది. ఆడవారికి జుట్టు మొత్తం పలుచబడిపోతుంది.

Benefits of honey for hair : తేనె రాస్తే జుట్టు తెల్లబడుతుందా? ఇందులో నిజమెంత..

ఇక శరీరంలో హార్మోన్ల స్ధాయిలలో వచ్చే మార్పుల వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. గర్భం, ప్రసవం, మెనోపాజ్, థైరాయిడ్ వంటివి హార్మోన్ల స్ధాయిలను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల కూడా జుట్టు నష్టపోయే అవకాశం ఉంటుంది. రింగ్ వార్మ్ అనే ఫంగల్ స్కిన్ ఇన్‌ఫెక్షన్ వల్ల జుట్టు రాలిపోతుంది. డయాబెటీస్, లూపస్ వల్ల కూడా బరువు పెరిగితే జుట్టు రాలడానికి దారి తీస్తుందట. జుట్టు రాలడం విషయంలో కొందరు వాడే మందులు దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. అలాంటి సందర్భాలలో సొంత వైద్యాలు మానుకుని వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఆడవారు జడలు, బన్స్, పోనీ టెయిల్స్ వదులుగా వేసుకోవాలి. జుట్టును మెలితిప్పడం లాంటివి చేయకూడదు. జుట్టు చిక్కు తీసేటపుడు కూడా వెడల్పాటి పళ్లున్న దువ్వెనను ఉపయోగించాలి.

ట్రెండింగ్ వార్తలు