BiggBoss Non Stop : బిగ్‌బాస్ నాన్ స్టాప్ మూడవ వారం కూడా పూర్తయి నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. బిగ్‌బాస్ నాన్ స్టాప్ పేరుతో ఈ సారి ఓటీటీలో టెలికాస్ట్ అవుతున్నా అంతకు ముందు ఉన్న క్రేజ్ లేదు. బిగ్‌బాస్ అభిమానులు మాత్రమే షోని తప్పకుండా ఫాలో అవుతున్నారు. ఇక అందులో ఉన్న కంటెస్టెంస్ట్ అభిమానులు మాత్రం వాళ్ళ కోసం షో చూస్తూ వాళ్ళకి ఓట్లు వేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అవ్వగా 14 మంది మిగిలారు.
తాజాగా ఈ వారం మామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈసారి లారీ, హారన్ టాస్క్ ద్వారా నామినేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఇందులో భాగంగా లారీ హారన్ సౌండ్ మోగినప్పుడు ఎవరైతే ముందుగా బజర్ నొక్కుతారో వారికి ఇద్దరిని నామినేషన్ చేసే ఛాన్స్ లభిస్తుంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్‌గా నామినేట్ చేయాలనేది మాత్రం ఇంటిసభ్యులు నిర్ణయిస్తారు. ఇక ఎప్పటిలాగే వాళ్ళ పాత పగలు లోపల పెట్టుకొని నామినేట్ చేశారు కంటెస్టెంట్స్.
Dil Raju : తండ్రి కాబోతున్న నిర్మాత దిల్‌రాజు ?
ఈ వారం మొత్తం ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. యాంకర్ శివ, బిందుమాధవి, అనిల్, అజయ్, సరయు, అరియానా, మిత్ర శర్మ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. మరి ఈ ఏడుగురిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే.