MCD House: సభలో బీజేపీ, ఆప్ సభ్యుల కుమ్ములాట.. నిన్న రాత్రి అలసిపోయి అక్కడే పడుకున్నారు. ఈరోజు లేవగానే మళ్లీ స్టార్ట్

MCD House: ఢిల్లీ మున్సిపల్ కార్యాలయంలో ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య కొనసాగుతున్న హైడ్రామా వేరే లెవల్‭కు వెళ్లింది. తాజాగా ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. బుధవారం ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కుమ్ములాట జరిగింది. పొద్దు పోయే వరకు ఘర్షణతోనే గడిపిన సభ్యులు.. అక్కడే తినేసి, ఎంసీడీ ప్రధాన హాలులోనే నిద్ర పోయారు. ఆ మర్నాడు నిద్ర లేచి మరోసారి కుమ్ములాటకు ప్రారంభమయ్యారు.

United Nations: రెండు నిమిషాలకు ఒక గర్భిణి మృతి.. తగ్గిన శిశు మరణాల రేటు.. ఐరాస నివేదికలో వెల్లడి

పోయిన ఏడాది డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‭కు ఎన్నికలు జరగ్గా డిసెంబర్ 7న ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల్లో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టమైన మెజారిటీయే వచ్చినప్పటికీ బీజేపీ కార్పొరేటర్లతో గొడవ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరికి సుప్రీం కోర్టు ఆదేశాల అనంతరం బుధవారం మేయర్ ఎన్నిక పూర్తైంది. అనంతరం కొద్ది గంటలకు ఇక స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రారంభం కావడమే మరోసారి ఘర్షణకు దారి తీసింది.

Joe Biden : అయ్యో..మళ్లీ తడబడిన బైడెన్ .. విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డ ప్రెసిడెంట్

బల్లలు విసిరేరారు. ఒకరినొకరు తోసుకున్నారు. చేతిలో ఉన్న ప్లాస్టిక్ బాలిళ్లను విసురుకున్నారు. ఆప్ సభ్యులు గాలిలో కొన్ని వస్తువులు విసిరారని అవి బీజేపీ సభ్యులకు తగలడంతో గాయాలయ్యాయని బీజేపీ ఆరోపించింది. అయితే సభలో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రవర్తిస్తోందని, రౌడీఇజం చేస్తూ ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. గురువారం సభ సమావేశం అయిన అనంతరం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఇరు పార్టీల సభ్యులు ఒకరినొకరు దూషించుకుంటూ ఘర్షణకు పాల్పడ్డారు.

Haryana Budget 2023: ‘సంక్షేమ బడ్జెట్’ ప్రవేశపెట్టిన హర్యానా సీఎం ఖట్టర్

బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారే వరకు సభ్యులు అక్కడే ఉండడంతో చాలా అలసిపోయి కనిపించారు. ఉదయం కాసేపు ఛాంబర్‌కు వెళ్లడంతో కొన్ని పనులు సద్దుమణిగినట్లు ఎంసీడీ వర్గాలు తెలిపాయి. గురువారం ఉదయం కొందరు సీట్లపై పడుకుని కనిపించారు. కొందరు కూర్చొని ముచ్చట్లు చెబుతూ కనిపించారు. అయితే కాసేపటికే మళ్లీ గందరగోళం కొనసాగడంతో మేయర్ షెల్లీ ఒబెరాయ్ సభను మరో గంటపాటు వాయిదా వేశారు. బీజేపీ కౌన్సిలర్లు ఆమెకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో.. బీజేపీ సభ్యులను కొందరిని సభ నుంచి బయటకు పంపారు. బుధవారమే ముగియాల్సిన స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక గురువారం సాయంత్రం అవుతున్నా పూర్తి కాలేదు.

ట్రెండింగ్ వార్తలు