Joe Biden : అయ్యో..మళ్లీ తడబడిన బైడెన్ .. విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డ ప్రెసిడెంట్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మరోసారి తడబడ్డారు. గతంలో కొన్ని సందర్భాల్లో మెట్లు ఎక్కుతూ తడబడిన బైడెన్ మరోసారి తడబడ్డారు. గతంలో ఓ మీటింగ్ కు వెళ్లిన సందర్భంగా మెట్లు ఎక్కుతూ తడబడ్డారు. పక్కనే ఉన్నవారు పట్టుకోవటంతో వెంటనే తమాయించుకుని బైడెన్ సాధారణంగా నడుచుకుంటూ వెళ్లారు. ఈక్రమంలో మరోసారి బైడెన్ తడబడ్డారు.ఈసారి విమనం మెట్లు ఎక్కుతూ జారిపడబోయారు.

Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మరోసారి తడబడ్డారు. గతంలో కొన్ని సందర్భాల్లో మెట్లు ఎక్కుతూ తడబడిన బైడెన్ మరోసారి తడబడ్డారు. గతంలో ఓ మీటింగ్ కు వెళ్లిన సందర్భంగా మెట్లు ఎక్కుతూ తడబడ్డారు. పక్కనే ఉన్నవారు పట్టుకోవటంతో వెంటనే తమాయించుకుని బైడెన్ సాధారణంగా నడుచుకుంటూ వెళ్లారు. ఈక్రమంలో మరోసారి బైడెన్ తడబడ్డారు.ఈసారి విమనం మెట్లు ఎక్కుతూ జారిపడబోయారు. కానీ పక్కన ఎవ్వరూలేరు.కానీ బ్యాలెన్స్ చేసుకుని మిగిలిన మెట్లుఎక్కారు. మెట్లు అన్నీ ఎక్కాక తిరిగి వెనక్కి తిరిగి చూసుకున్నారు. ఇలా బైడెన్ పాపం పలుమార్లు మెట్లు ఎక్కుతూనే నడుస్తునో నడబడటం పరిపాటిగా మారిపోయింది. ఇలా బైడెన్ తడబడిన సంఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అలాగే ఈసారికూడా విమానం ఎక్కుతూ జారి పడబోయిన బైడెన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యుక్రెయిన్, పోలండ్ పర్యటన ముగించుకుని తిరుగుపయనమైన సమయంలో ఈ ఘటన జరిగింది. మెట్లమీద తడబడిన బైడెన్ దాన్ని కవర్ చేసుకోవటానికి తరువాత మెట్లన్నీ గబగబా ఎక్కేసినట్లుగా కనిపిస్తోంది.

ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వెళ్లేందుకు సగం మెట్లను మెల్లగానే చాలా ఆచీ తూచీ ఎక్కిన బైడెన్.. మిగతావి ఎక్కుతుండగా స్లిప్ అయ్యారు. అలానే ముందుకు ఒరిగిపోయారు. చేతులతో మెట్లను పట్టుకుని నిలదొక్కుకుని పైకి లేచారు. తర్వాత విమానం మెట్లు అన్నీ ఎక్కాక తిరిగి చూసారు. చెయ్యెత్తి అభివాదం చేసి లోపలికి వెళ్లిపోయారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతుండగా మెట్లు జారి బైడెన్ పడిపోవడం ఇదే తొలిసారి కాదు. 2021లో జార్జియా వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ బైడెన్ రెండుసార్లు తడబడ్డారు. 2022 మే నెలలో ఆండ్రూ ఎయిర్ బేస్ లో మెట్లు ఎక్కుతుండగా బ్యాలెన్స్ కోల్పోయారు. లాస్ ఏంజెలెస్ లో ‘సమ్మిట్ ఆఫ్ అమెరికా’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ మరోసారి మెట్లు ఎక్కడంలో కూడా తడబడ్డారు బైడెన్.

ఇలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటువంటి ఘటనలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా..ఏదోక ఘటనతో వార్తల్లో నిలుస్తున్నాయి. ఓ మీటింగ్‌కు వెళ్లి డయాస్‌పై ఎటు వెళ్లాలో కన్‌ఫ్యూజ్‌ అయిన ఘటన అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఆ తరవాత కూడా రెండు మూడు సమావేశాల్లో కన్‌ఫ్యూజ్ అయ్యారు బైడెన్. అలాగే ఓ మీటింగ్ లో ఓ మహిళ ప్రస్తావించాల్సి ఉండగా ఆమె పేరు మర్చిపోయారు.

కాగా బైడెన్ కాస్త అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. ఇది కొంచెం అనేకంటే కాస్త ఎక్కువైందనే అనుకోవాలి.ఎందుకంటే ద్వైపాక్షిక సమావేశాల్లో ఎదురుగా కూర్చున్న దేశాధినేత పేరే మర్చిపోతుంటారు. ఏదొక కార్యక్రమానికి ప్రసంగించేందుకు పోడియం వద్దకు వచ్చి మాట్లాడాల్సిన టాపిక్ మర్చిపోతారు. ఒక దేశం పేరు ప్రస్తావించబోయి మరొక దేశం పేరు చెబుతారు. అల్జీమర్ అనేది సాధారణ సమస్యే అయినా కానీ బైడెన్ అషామాషీ వ్యక్తి కాదు మరి. అమెరికా అధ్యక్షుడు. అందుకే జో బైడెన్‌అగ్రరాజ్యానికి అధ్యక్షుడు కావడం వల్ల బాగా హైటైల్ అవుతోంది. ఇటువంటి ఘటనలతో బైడెన్ వైరల్ అవుతుంటారు.

ట్రెండింగ్ వార్తలు