Imran Khan: రంగంలోకి యునైటెడ్ నేషన్స్.. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యేనా?
తాజాగా ఆయన మాజీ భార్య జెమీమా ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్ కలకలం రేపుతోంది. ఇమ్రాన్ గురించి తాను 'ఎక్స్' ప్లాట్‌ఫామ్‌పై పెడుతున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని..
Imran Khan: గత రెండేళ్లుగా పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం మరోసారి రచ్చ చేస్తోంది. జైల్లో ఆయన్ని చిత్రహింసలు పెడుతున్నారని ఇప్పటికే అనేక ఆరోపణలు రాగా.. గత నెలలో అసలు ఇమ్రాన్ ఖాన్‌ని చంపేశారనే ప్రచారం కూడా సాగింది. ఐతే ఆయన తోబుట్టువులు జైల్లో ఇమ్రాన్‌ని చూసి వచ్చిన తర్వాత ఆ ప్రచారం ఆగిపోయింది.
తాజాగా ఆయన మాజీ భార్య జెమీమా ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్ కలకలం రేపుతోంది. ఇమ్రాన్ గురించి తాను ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌పై పెడుతున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని, తన ఖాతాలో ఉన్న ‘విజిబిలిటీ ఫిల్టరింగ్’ను సరిచేయాలని ఎలాన్ మస్క్‌కు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. “చట్టవిరుద్ధంగా నిర్బంధంలో ఉన్న తమ తండ్రిని చూసేందుకు, మాట్లాడేందుకు మా కుమారులకు అనుమతి లేదు. కేవలం ఎక్స్ ద్వారా మాత్రమే ఇమ్రాన్ పరిస్థితిని ప్రపంచానికి చెప్పగలం” అని జెమీమా తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత సున్నితమైన రాజకీయ అంశంపై, బిడ్డల తరఫున ఆమె చేసిన ఈ విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ స్పెషల్ సెల్ రాపోర్ట్యూర్.. అలైస్ జిల్ ఎడ్వర్డ్స్ పాక్ ప్రభుత్వానికి ఇచ్చిన పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ సాలిటరీ సెల్‌లో ఇమ్రాన్ ఖాన్‌ని బంధించడం తగదని.. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని గుర్తు చేశారు. 15 రోజులకి మించి ఇలా సాలిటరీ సెల్‌లో ఉంచడమంటేనే అది అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన కాగా..దాదాపు రెండేళ్లుగా ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించారామె. వీలైనంత త్వరగా ఈ నరకం నుంచి ఇమ్రాన్ ఖాన్‌ని బయటకి తీసుకురావాలని పాకిస్థాన్ ప్రభుత్వానికి సూచించారామె. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్‌ఖాన్ విషయంలో పాక్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్‌పై అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం.. ఆ సుంకాలు ఎత్తేస్తారా?
