2026 Main Events: 2026లో జరిగే అద్భుతాలు ఇవే.. మానవసహిత చంద్రయాత్ర, ఫిఫా వరల్డ్ కప్.. ప్రపంచంలో భారీ మార్పులు..
చైనా ఖగోళ పరిశీలన కోసం రూపొందించిన స్పేస్ టెలిస్కోప్ క్సున్తియాన్‌ను మిషన్‌ను 2026లో ప్రారంభించనుంది.
Artemis II
2026 Main Events: కొత్త ఏడాది వచ్చేస్తోంది. 2025లో అంతరిక్ష, క్రీడా, టెక్నాలజీ రంగాల్లో ఎన్నో విశేషాలను చూశాం. 2026లో ఆయా రంగాల్లో అంతకంటే గొప్ప అంశాలు ఉన్నాయి. నాసా చంద్రయాత్ర ఆర్టెమిస్ II, కొత్త అంతరిక్ష మిషన్లు, ఫిఫా ప్రపంచ కప్, పలు గ్లోబల్ సైన్స్ కాన్ఫరెన్సులు వంటివి ఉన్నాయి.
అంతరిక్షంలో..
నాసా చంద్రయాత్ర ఆర్టెమిస్ II మిషన్‌ను 2026 ఏప్రిల్‌లో చేపట్టనున్నారు. ఈ మిషన్‌లో వ్యోమగాములు చంద్రుని చుట్టూ ప్రయాణం చేస్తారు. కానీ, చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టరు. ఇది నాసా ఆర్టెమిస్ ప్రోగ్రాంలో రెండవ మిషన్. నలుగురు వ్యోమగాములు చంద్రుని చుట్టూ 10 రోజుల ప్రయాణం చేస్తారు. మొదటి మిషన్ (ఆర్టెమిస్ I)లో అస్ట్రోనాట్లు లేకుండా రాకెట్, స్పేస్‌షిప్ సిస్టమ్‌లను పరీక్షించింది.
చైనా Chang’e 7 మిషన్ (2026 చివరలో)ను చంద్రుని దక్షిణ ధ్రువాన్ని అన్వేషించడానికి ప్రయోగిస్తుంది. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్, మినీ ఫ్లయింగ్ ప్రోబ్‌ను పంపనుంది.
చైనా ఖగోళ పరిశీలన కోసం రూపొందించిన స్పేస్ టెలిస్కోప్ క్సున్తియాన్‌ను మిషన్‌ను 2026లో ప్రారంభించనుంది. దాని లక్ష్యం నక్షత్రాలు, గెలాక్సీలు, చీకటి పదార్థం, నక్షత్ర ఉత్పత్తి ప్రక్రియలు మొదలైన వాటిని పరిశీలించడం. ఈ స్పేస్ టెలిస్కోప్.. తియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌తో సహ-కక్ష్యలో కదలుతూ పని చేస్తుంది. అంటే స్టేషన్ చుట్టూ తిరుగుతూ సమాచారం సేకరిస్తుంది.
క్రీడల్లో
ఫిఫా వరల్డ్ కప్ 2026లోనే జరగనుంది. జూన్ 11 – జూలై 19 మధ్య అమెరికా, కెనడా, మెక్సికోలో జరుగుతుంది. 16 నగరాల్లోని స్టేడియాల్లో 48 జట్లు, 104 మ్యాచ్‌లు ఆడతాయి. ప్రారంభ మ్యాచ్ మెక్సికో, దక్షిణాఫ్రికా మధ్య మెక్సికో సిటీలోని ఎస్టాడియో అజ్టెకాలో జరుగుతుంది.
భారత్, శ్రీలంక సంయుక్తంగా 2026లో టీ20 ప్రపంచ కప్ నిర్వహించబోతున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు మ్యాచులు జరుగుతాయి. ఇందులో 20 జట్లు పాల్గొంటాయి.
శాస్త్రీయంగా
బయోటెక్నాలజీలో కొత్త ఔషధాలు, జీన్ ఎడిటింగ్ సాంకేతికతలు రానున్నాయి.
పునరుత్పాదక శక్తిలో సౌర శక్తి, హైడ్రోజన్ ఇంధనం వంటివి బాగా పెరిగిపోనున్నాయి.
స్మార్ట్ వ్యవసాయం పెరగనుంది. ఏఐ ఆధారిత పంటల పర్యవేక్షణ సాధారణమైపోతుంది.
నానో సాంకేతికత పెరుగుతుంది.
గ్లోబల్ కాన్ఫరెన్సులు
న్యూరోసైన్స్ కాంగ్రెస్ 2026లో మే 14-15 మధ్య కౌలాలంపూర్‌లో జరగనుంది.
గేమిఫిన్ 2026 (గేమిఫికేషన్ సదస్సు) 2026లో జరుగుతుంది. మార్చి 23-27 మధ్య ఫిన్లాండ్‌లో నిర్వహిస్తారు.
