Revanth Reddy : తెలంగాణపై కేసీఆర్,కేటీఆర్ కుట్రలు చేస్తున్నారు-రేవంత్ రెడ్డి

తెలంగాణపై కేసీఆర్,కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని టీపీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Revanth Reddy :  తెలంగాణపై కేసీఆర్,కేటీఆర్  కుట్రలు చేస్తున్నారని టీపీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన   ఢిల్లీలో మాట్లాడుతూ…వర్షాలు, వరదలతో   రాష్ట్రం అతలాకుతలమైతే కెసీఆర్   జాతీయ రాజకీయాల పేరుతో సమీక్ష సమావేశాలు నిర్వహించారని అన్నారు.  ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో   పంట నష్టం వాటిల్లగా   వందల కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని…ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని రేవంత్ రెడ్డి  తెలిపారు.

క్లౌడ్ బస్టింగ్ అని….. విదేశీ కుట్ర అని…. ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టించారని…ఆమాటలు ఎవరూ నమ్మక పోవటంతో ఇప్పుడు పోలవరం ఎత్తు పెంచారని కొత్త నాటకానికి తెరదీశారని రేవంత్ రెడ్డి అన్నారు.  నిజంగా కేసీఆర్‌కి    మోడీపై    పోరాడాలని ఉంటే తక్షణం ఢిల్లీ   వచ్చి వర్షాలు,వరదల వల్ల తెలంగాణకు కలిగిన నష్టంపై   సాయం చేయమని ప్రధానిని కోరాలి,  ఢిల్లీలో పోరాడాలి.. అంతే కానీ కేంద్రంపై పోరాటం చేయాల్సింది చేయకుండా కేసీఆర్ మాటలతో మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి   వస్తేనే ప్రజల ఆకాంక్షలు రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన   వారందరికీ సముచిత గౌరవం స్థానం లభిస్తుందని… తెలంగాణలో తదుపరి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పని సరిగా అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన చెప్పారు.   తెలంగాణ    ప్రజల సంక్షేమం కోసం.. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో అందరూ కలిసి రావాలని… భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Also Read : Uttar Pradesh Farmer : వరుణ దేవుడిపై ఫిర్యాదు చేసిన రైతు

ట్రెండింగ్ వార్తలు