Minister Amit Shah: మోదీ పాలనలో అంగుళం కూడా ఆక్రమణ జరగలేదు.. పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఆందోళన వెనుక వేరే కారణం

1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అయితే, మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఆక్రమించులేదని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. చైనాకు ఒక్క ఇంచు కూడా వదులుకునేది లేదన్నారు.

Minister Amit Shah: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాపై సరిహద్దు వివాదంపై మాట్లాడిన ఆయన.. 1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అయితే, మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఆక్రమించులేదని స్పష్టం చేశారు. చైనాకు ఒక్క ఇంచు కూడా వదులుకునేది లేదన్నారు. నేను ప్రశ్నోత్తరాల జాబితాను చూశాను. ఐదవ ప్రశ్న తర్వాత కాంగ్రెస్ అత్యుత్సాహం కనిపించింది.

India-China face off: రాజ్‌నాథ్ ప్రకటన తర్వాత లోక్‌సభలో గందరగోళం.. విపక్షాల వాకౌట్

ఆ ప్రశ్నను కాంగ్రెస్ సభ్యుడే అడిగారు. సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ వారు సభకు అంతరాయం కలిగించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు సంబంధించి ఎఫ్‌సీఆర్ఏ రద్దు గురించి వేసి ప్రశ్న ప్రస్థావనకు రాకుండా ఉండేందుకే సరిహద్దు అంశాన్ని పార్లమెంట్ లో కాంగ్రెస్ లేవనెత్తిందని అమిత్ షా విమర్శించారు. దీనికి సంబంధించిన సమాధానం కూడా ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నామని అన్నారు. 2005-2006, 2006 – 2007 మధ్య కాలంలో చైనా రాయబార కార్యాలయం నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రూ. 1.35కోట్ల గ్రాంట్ పొందిందని అమిత్ షా అన్నారు.

India-China face off: చైనా సైనికులు మన భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు: లోక్‌సభలో రాజ్‌నాథ్ ప్రకటన

అది ఎఫ్‌సీఆర్ఏ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఆరోపించారు. అందువల్లనే దాని రిజిస్ట్రేషన్ ను కేంద్ర హోంశాఖ రద్దు చేసిందని తెలిపారు. చైనామీద నెహ్రూకు ఉన్న ప్రేమ కారణంగానే ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని అమిత్ షా వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు