Arabic Kuthu: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అరబిక్ కుతు సాంగ్!

ప్యాన్ వరల్డ్ సాంగ్ గా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది బీస్ట్ అరబిక్ కుతు. ఈ పాటకు దళపతి విజయ్ తో పాటూ బుట్టబొమ్మ..

Arabic Kuthu: ప్యాన్ వరల్డ్ సాంగ్ గా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది బీస్ట్ అరబిక్ కుతు. ఈ పాటకు దళపతి విజయ్ తో పాటూ బుట్టబొమ్మ వేసిన స్టెప్పులిప్పుడు ఫుల్ వైరల్ గా మారాయి. షరా మామూలుగా వ్యూస్, లైక్స్ రికార్డ్స్ తో.. హలమితి హబిబో.. ఓ వైపు దుమ్ము రేపుతుంటే.. మరోవైపు ఆడియెన్స్ నుంచి సెలెబ్రిటీస్ వరకు ఈ ట్యూన్ రీల్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు.

Arabic Kuthu: విజయ్ బీస్ట్ పాటకి ఎన్టీఆర్ ‘లవ్ దెబ్బ’ మాస్ స్టెప్పులేస్తే?!

హలమితి హబిబో అంటూ రెచ్చిపోతున్నారు దళపతి ఫ్యాన్స్. లేటెస్ట్ గా రిలీజైన తమిళ్ స్టార్ విజయ్ బీస్ట్ సాంగ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ గా మారింది. కోలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచంద్రన్ కంపోజ్ చేసిన ఈ పాటకు హీరో శివకార్తికేయన్ లిరిక్స్ అందించడం ఓ స్పెషాలిటీ. ప్రెజెంట్ 60 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసేందుకు రెడీగా ఉన్న అరబిక్ కుత్తు.. 48 గంటల్లోనే గ్లోబల్ టాప్ సాంగ్స్ లిస్ట్ లో కూడా ప్లేస్ దక్కించుకుంది. సో సేమ్ టైమ్ అటు కామన్ పీపుల్ నుంచి క్రేజీ సెలబ్రిటీస్ వరకు ఈ సాంగ్ రీల్స్ తో సోషల్ మీడియోను హీటెక్కిస్తున్నారు.

Mahesh-Vijay: ఫ్యాన్స్ మధ్య సిల్లీ వార్.. దెబ్బకి నెవెర్ బిఫోర్ రికార్డ్స్!

ఒరిజనల్ వర్షన్ లో స్టెప్పులేసిన పూజా హెగ్డే స్పెషల్ గా అరబిక్ కుతుకి మళ్లీ చిందులేసింది. అటు సమంతా ఎయిర్ పోర్ట్ లో ఇదే పాటకు రీల్ చేసి బుట్టబొమ్మతో అద్భుతం అనిపించుకుంది. కిడ్స్ నుంచి టాంజెనియన్ టిక్ టాకర్ కిలి పాల్ వరకు ప్రతిఒక్కరి స్టేటస్ ఇప్పుడు బీస్ట్ సాంగ్ ట్యూన్ తోనే కనిపిస్తోంది. ఒక్క పాటతో సెన్సేషనల్ గా మారిన విజయ్ బీస్ట్ ను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 14న సినిమాను థియేటర్స్ కు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ట్రెండింగ్ వార్తలు