Vishwaksen : SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన బేబీ సినిమా ఎంతటి విజయం అందుకుందో అందరికి తెలిసిన విషయం. చిన్న సినిమాగా వచ్చి ఏకంగా వరం రోజుల్లోనే 50 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆసచర్యపరిచింది. సక్సెస్ మీట్స్, టూర్స్ తో చిత్రయూనిట్ ఇప్పుడు కూడా బిజీగా ఉన్నారు. ఇక ఈ మూవీ అల్లు అర్జున్ కి కూడా బాగా నచ్చడంతో ఒక స్పెషల్ ఈవెంట్ పెట్టి చిత్ర యూనిట్ ని అభినందిచాడు.
అయితే డైరెక్టర్ సాయి రాజేష్ గతంలో హృదయకాలేయం, కొబ్బరిమట్ట అనే సినిమాలు డైరెక్టర్ గా చేశాడు. సంపూర్ణేష్ బాబుతో చేసిన ఆ సినిమాలు స్పూఫ్ సినిమాలైనా కామెడీగా ఉండటంతో మంచి విజయం సాధించి కలెక్షన్స్ కూడా వచ్చాయి. బేబీ సినిమా రిలీజయి సక్సెస్ అయిన తర్వాత జరిగిన పలు ఈవెంట్స్ లో సాయి రాజేష్ మాట్లాడుతూ.. ఆనంద్ కంటే ముందుగా ఓ ముగ్గురు హీరోలను అనుకున్నాం. ఓ హీరో దగ్గరకు వెళ్లి వద్దని అనుకున్నాను. హృదయ కాలేయం తీసిన డైరెక్టరా? అయితే కథ కూడా వినను అని మరో హీరో అన్నాడు. ఆ మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. అప్పుడే ఈ బేబీ సినిమాను మరింత బాగా తీయాలని అనుకున్నాను. ఈ సినిమాతో నన్ను నేను నిరూపించుకోవాలని అనుకున్నాను అని చెప్పాడు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారి ఈ డైరెక్టర్ పై అలాంటి కామెంట్స్ చేసిన హీరో ఎవరో అని అంతా ఆసక్తిగా చర్చించుకున్నారు.
ఇవే వ్యాఖ్యలని సాయి రాజేష్ మూడు, నాలుగు సార్లు చెప్పాడు. అయితే తాజాగా విశ్వక్ సేన్ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో.. నో మీన్స్ నో. ఇది మగవాళ్ళకి కూడా వర్తిస్తుంది. కాబట్టి అరవకుండా సైలెంట్ గా కూర్చోండి. ఇక్కడ అంతా ప్రశాంతంగానే ఉంది. జస్ట్ రిలాక్స్ అని నవ్వుతూ ఉన్న సింబల్ పెట్టి ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అసలు ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అని కొంతమంది కామెంట్స్ చేయగా, సాయి రాజేష్ బేబీ ఈవెంట్ అయ్యాక ఈ ట్వీట్ పెట్టడంతో ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడని అని కొంతమంది కామెంట్స్ చేశారు.
ఇక అదే టైంలో.. నేను నీ ట్వీట్స్ అన్ని చూస్తున్నాను.. పర్లేదు చేసుకో అని ట్వీట్ చేశాడు. ఇది ఎవర్ని ఉద్దేశించి చేశాడో మాత్రం చెప్పలేదు. కానీ విశ్వక్ ట్వీట్ కి కౌంటర్ అని కొంతమంది కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో సమాచారం ప్రకారం సాయి రాజేష్ బేబీ సినిమా కథని విశ్వక్సేన్ కి చెపుదాం అనుకున్నాడట. కానీ అలాంటి స్పూఫ్ సినిమాలు తీసే డైరెక్టర్ తో నేను చేయను అని అనడంతో సాయి రాజేష్ కూడా మళ్ళీ విశ్వక్ ని కలవడానికి ప్రయత్నించలేదు అని సమాచారం. ఆ మాటకి కోపం వచ్చే సాయి రాజేష్ ఇప్పుడు లవ్ సినిమాతో హిట్ కొట్టాక ఆ వ్యాఖ్యలు చేశాడు.
దీంతో వీరిద్దరి ట్వీట్స్ ఇప్పుడు ట్విట్టర్లో వివాదంగా మారాయి. బేబీ సినిమా అభిమానులు, విశ్వక్ అభిమానులు ఒకరిపై ఒకరు కామెంట్స్ చేస్తూ ట్విట్టర్ లో రచ్చ చేస్తున్నారు. అయితే దీనిపై వారిద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే తప్ప సాయి రాజేష్ చెప్పింది విశ్వక్ గురించేనా? విశ్వక్ సాయి రాజేష్ గురించే ట్వీట్ చేశాడా అనేది తెలియదు.
"No means no" applies to men as well, so let's keep it cool and refrain from shouting. We're all about that peaceful vibe here, so let's just relax. ✌️
— VishwakSen (@VishwakSenActor) July 20, 2023
Yeah…Go ahead…Iam reading ur tweets…
— Sai Rajesh (@sairazesh) July 20, 2023
స్టోరీ రాశామా.. సినిమా తీశామా.. హిట్టు కొట్టామా ..మళ్లీ కొత్త కథ కోసం పెన్ను పేపర్ పట్టుకున్నామా..అని లేకుండా మధ్యలో ఈ లొల్లి ఎందుకు బాసు నీకు? అసలే హీరోస్ సెంట్రిక్ ఇండస్ట్రీ మనది.హీరోలతో పెట్టుకుంటే మనం ఉంటామా🤣
— Cine Medhavi (సినీ మేధావి) (@NenuNaaCinema) July 21, 2023
His talking about baby movie . Director stage medha okka mata antadu danigurinche.
— Leanka Manikanta (@LeankaManikanta) July 21, 2023
Okay.. Baby Story Sairajesh chepthe reject chesindi nuvvena.
Thanu stage midha.. Nuvvu twitter lo start cheyyandi ika
— Arjun🕶 (@Mr_Achieverr) July 20, 2023