PM Modi Convoy : ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం..ఏడాది క్రితమే పక్కా ప్లాన్!

బుధవారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై  కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

PM Modi Convoy : బుధవారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై  కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ప్రధాని పర్యటనలో భద్రతా లోపం..ఓ పక్కా పథకం ప్రకారం పన్నిన కుట్ర అని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్న ఓ వీడియో ఇప్పుడు బయటికొచ్చింది. మోదీ పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న అంశాలే…సరిగ్గా ఏడాది క్రితం యూట్యూబ్ లో అప్ లోడ్ చేయబడిన ఓ యానిమేటెడ్ వీడియోలో కనిపిస్తోండటం బీజేపీ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉంది.

డిసెంబర్-3,2020న యూట్యూబ్ లో అప్ లోడ్ చేయబడిన ఓ యానిమేటెడ్ వీడియోలో ఏదైతే కనిపిస్తోందో..సరిగ్గా బుధవారం ప్రధాని పంజాబ్ పర్యటనలో అలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. ప్రధాని కాన్వాయ్ ను ఓ ఫ్లై ఓవర్ పై ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి,భారీ జనసమూహం అడ్డుకుంటున్నట్లు ఆ యానిమేటెడ్ వీడియోలో కనిపిస్తోంది. బుధవారం మోదీ పంజాబ్ పర్యటనకు వెళ్లినప్పుడు సరిగ్గా ఆ వీడియోలో ఉన్నట్లే జరిగింది. దీంతో మోదీ కాన్వాయ్ పై దాడి చేయాలని ఏదైనా తీవ్రవాద సంఖ్య కుట్ర పన్నిందా అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలెత్తుతున్నాయి.

ఇక,బీజేపీ-పంజాబ్ లోని అధికార కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మోదీ ప్రణానికి ప్రమాదం అన్న ఆరోపణలను పంజాబ్ సీఎం చన్నీ కొట్టిపారేశారు. ప్రధాని ప్రణానికి ఎటుంవటి ముప్పు లేదని, ఫిరోజ్ పూర్ లో బీజేపీ నిర్వహించిన సభకు జనం రాలేదన్న కారణంతోనే ఆ రోజు మోదీ భద్రతా లోపం అన్న సాకుతో అర్థాంతరంగా పంజాబ్ పర్యటన రద్దు చేసుకొని ఢిల్లీ వెళ్లిపోయారని పంజాబ్ సీఎం చన్నీ తెలిపారు.

ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంశాఖ పెద్ద,కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను కేంద్ర హోంశాఖ సేకరిస్తోందని,దాని ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అనురాగ్ ఠాకూర్ చెప్పారు.

కాగా,రెండేళ్ల తర్వాత బుధవారం పంజాబ్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి అనూహ్య పరిస్థితి ఎదురైన విషయం తెలిసిందే. మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనకారులు రహదారిని అడ్డుకోగా..దాదాపు 20 నిమిషాల పాటు ఫిరోజీ పూర్ జిల్లాలోని హుస్సేనీవాలా ఏరియాకు దగ్గర్లో ఉన్న ఓ ఫ్లైఓవర్​పై మోదీ కాన్వాయ్ ఆగిపోయింది. దీంతో ఆకస్మికంగా పంజాబ్ పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి తిరుగుముఖం పట్టారు ప్రధాని.

ALSO READ Blue Colour Roads: రోడ్ల రంగు మార్చేస్తున్న దేశం,నల్లటి రోడ్లకు నీలం రంగు వేస్తున్న ప్రభుత్వం..

ట్రెండింగ్ వార్తలు