Blue Colour Roads: రోడ్ల రంగు మార్చేస్తున్న దేశం,నల్లటి రోడ్లకు నీలం రంగు వేస్తున్న ప్రభుత్వం..

రోడ్ల రంగు మార్చేస్తోంది ఆ దేశం. నల్లటి రోడ్లకు నీలం రంగు వేస్తోంది ప్రభుత్వం..ఎందుకంటే..

Blue Colour Roads : రోడ్లు ఎలా ఉంటాయి? అంటే మా ఏరియాలో రోడ్లా? గుంతలు గుంతలుగా ఉంటాయిని చెబుతారు. ఏరంగులో ఉంటాయి? అంటే హా..ఎలా ఉంటుంది? కంకర రోడ్డు అయితే ఎర్రగా ఉంటుంది. తారు రోడ్డు అయితే నల్లగా ఉంటుంది. అదే సిమెంట్ రోడ్డు అయితే తెల్లగా ఉంటుంది..అదో పెద్ద విషయమా? అంటారు. కానీ రోడ్లు నీలాకాశం రంగులో ఉంటాయనే విషయం మీకు తెలుసా? నీలం రంగుల్లో మెరిసిపోయే రోడ్లు ఉంటాయని తెలుసా? అంటే కాస్త ఆలోచిస్తాం..అసలు రోడ్లు నీలి రంగులో ఉండటమేంటీ? అని ఆలోచిస్తాం.

కానీ ఖతార్ లో మాత్రం రోడ్లు నీలం రంగులో మెరిసిపోతు కనిపిస్తాయి. ఖతార్‌ దేశంలో నలుపుతో ఉన్న రోడ్డును రంగు మార్చేందుకు ప్రాజెక్టును చేపట్టింది. రోడ్డు అందంగా..ఆకర్షణీయంగా కనిపించడానికి ఈ రంగు వేశారేమో అనుకుంటున్నారు కదూ..కానే కాదు. నల్లటి రోడ్లను నీలం రంగులోకి మార్చే ప్రాజెక్టు వెనక ఓ ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఖతార్‌ రాజధాని దోహాలో ప్రభుత్వం 2019లో పైలట్ ప్రాజెక్టు కింద నలుపు రంగు రోడ్లను వేరే రంగులకు మార్చే పనిని ప్రారంభించింది. దీంట్లో భాగంగా దోహాలోని కొన్ని వీధులు నీలం రంగులోకి మార్చింది. రోడ్లను నీలం రంగులోకే ఎందుకు మార్చారంటే..

ఇదికూడా చదవండి : రికార్డు టైమ్ లో నేషనల్ హైవే : 18 గంటల్లో 25 కి.మీ రోడ్డు నిర్మాణం

నీలం రంగు ద్వారా రోడ్డు ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు ఎంతో ప్రయోజనం కూడా కలుగుతోందట. ఏ రోడ్డులోనైనా ఈ ప్రత్యేక రకం పూత పూసిన తర్వాత అక్కడి ఉష్ణోగ్రతపై 50 శాతం తేడా ఉంటుందని.. అందులో ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీల వరకు ఉంటుందని భావిస్తున్నారు అధికారులు. గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి ఇలా చేసినట్లుగా తెలుస్తోంది.

దోహా నగరంలోని ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో 1 మి.మీ. మందపాటి నీలం పూత పూస్తారు. అలాగే సైకిలిస్టులకు..పాదచారుల కోసం కటారా క్లచ్రాల్ గ్రామం సమీపంలో 200 మీటర్ల పొడవునా ఒక మార్గాన్ని నిర్మించారు. ఈ రోడ్లకు నీలం  రంగు వేయడానికి కారణం ఉష్ణోగ్రతను తగ్గించటానికేనంటున్నారు అధికారులు. ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత సెన్సార్లను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

ఇదికూడా చదవండి :  కొలుదీరిన కుటీరం : ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇల్లు భలే ఉందిగా..

ఈ నీలం రంగు పూత పూయడం వల్ల రేడియేషన్‌ను 50శాతం వరకు తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అందుకే నల్లగా ఉండే రోడ్లకు నీలం రంగు పూతను పూస్తున్నారు. దోహాలో రోడ్లకు నీలం రంగు వేసి 18 నెలల పాటు పరిశీలించారు. ఉష్ణోగ్రతల్లో మార్పులను గమనించారు. ఇటువంటి ప్రయోగాలు చేయబోయే లిస్టులో లాస్ ఏంజిల్స్, మక్కా, టోక్యో వంటి దేశాలు కూడా ఉండటం గమనించాల్సిన విషయం.

ట్రెండింగ్ వార్తలు