Reduce Stress : ఒత్తిడిని తగ్గించే మార్గాలు

సిగరెట్లు, నికోటిన్ కలిగిన వస్తువులను ఉపయోగించడం మానేయండి. నికోటిన్ ను కొందరు ఒత్తిడి నివారిణిగా సూచిస్తారు. నికోటిన్ శారీరక ఉద్రేకాన్ని పెంచడం ద్వారా , రక్త ప్రసరణ , శ్వాసక్రియను తగ్గించి శరీరంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.

Reduce Stress : ఒక పని కారణంగా ఏర్పడే శరీరం యొక్క ప్రతిస్పందనను ఒత్తిడిగా సూచిస్తారు. చిన్న చిన్న అసౌకర్యాల నుండి విడాకులు తీసుకోవడం లేదా ఉద్యోగం కోల్పోవడం వంటి తీవ్రమైన జీవిత మార్పుల వరకు అనేక పరిస్థితులు ఒత్తిడికి దారితీస్తాయి. ఒత్తిడిని అనుకూలమైనా, ప్రతికూలమైనా ఆరోగ్యకరమైన రీతిలో ఎదుర్కోవచ్చు. ఒత్తిడి ప్రతిచర్య కారణంగా అధిక హృదయ స్పందన రేటు,రక్తపోటు వంటివి తలెత్తుతాయి. ఒత్తిడితో వ్యక్తిగత ఆలోచనలు, భయం, కోపం వంటి భావోద్వేగాలు ఉంటాయి.

దీర్ఘకాలిక ఒత్తిడి మానసిక ఆరోగ్య సమస్యలు, పెరుగుతున్న శారీరక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఒత్తిడి స్థాయిలు పెరగడం, శారీరం వ్యాధిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎవరూ ఒత్తిడి నుండి తప్పించుకోలేరు, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మంచిఆహారం తీసుకోవటం వంటివి చేయాలి. కొంతమంది వ్యక్తులు మద్యపానం, అతిగా తినడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తారు. ఇలా చేయటం వల్ల స్వల్పకాలంలో ప్రయోజనకరంగా కనిపించవచ్చు, కానీ అవి దీర్ఘకాలంలో ఒత్తిడిని పెంచుతాయి సరైన, సమతుల్య ఆహారం తీసుకోవడం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. వ్యాయామం గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండటమే కాకుండా ఒక శక్తివంతమైన ఒత్తిడి నివారిణిగా సహాయపడుతుంది. ఏరోబిక్ వ్యాయామం, వెయిట్ లిఫ్టింగ్, యోగా వంటి కదలిక వ్యాయామాలను ప్రయత్నించటం మంచిది. ఏరోబిక్ వ్యాయామం ఎండార్ఫిన్ల ఉత్పత్తిని పెంచుతుంది. సహజమైన సమ్మేళనాలు మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఉల్లాసమైన మానసిక స్థితిని అందిస్తాయి.

సిగరెట్లు, నికోటిన్ కలిగిన వస్తువులను ఉపయోగించడం మానేయండి. నికోటిన్ ను కొందరు ఒత్తిడి నివారిణిగా సూచిస్తారు. నికోటిన్ శారీరక ఉద్రేకాన్ని పెంచడం ద్వారా , రక్త ప్రసరణ , శ్వాసక్రియను తగ్గించి శరీరంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రతిరోజూ విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని వెచ్చించడం మంచిది. అది ఒత్తిడి నుండి శరీరాన్ని రక్షిస్తుంది. పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి. వీలైనప్పుడల్లా అందరితో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించాలి. ఫ్రెండ్స్‌తో మాట్లాడాలి. అభిప్రాయాలు షేర్ చేసుకోవాలి. సమస్యల్ని చెప్పుకోవడం ద్వారా సాంత్వన లభిస్తుంది.

నవ్వు,ఆందోళన,ఒత్తిడులకు దివ్య ఔషదముగా పనిచేస్తుంది నవ్వేటప్పుడు ఎండోర్ఫిన్స్ అనే హార్మోనులు విడుదల అయి ఒత్తిడిని తగ్గిస్తాయి. మనస్సును ఆందోళనపరిచే ఆలోచనలనుండి దూరంగా జరగటం మంచిది. మనస్సులో భాదను సన్నిహితులతో పంచుకుంటే ఎంతో రిలీఫ్ పొందవచ్చు. ఇలా కొన్ని మార్గాలను అనుసరించటం ద్వారా ఒత్తిడి నుండి సులభంగా బయటపడవచ్చు.

ట్రెండింగ్ వార్తలు