IND vs WI : భార‌త్‌తో రెండో టెస్టు.. యువ ఆల్‌రౌండ‌ర్‌కు పిలుపు.. భార‌త బ్యాట‌ర్ల‌ను స్పిన్ ఉచ్చులో బంధించేందుకు..!

డొమినికా వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన మొద‌టి టెస్టులో వెస్టిండీస్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ఇన్నింగ్స్ 141 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. ఈ క్ర‌మంలో జూలై 20 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో ప‌రువు నిలుపుకోవాల‌నే ల‌క్ష్యంతో విండీస్ బ‌రిలోకి దిగుతోంది.

Kevin Sinclair

IND vs WI 2nd Test : డొమినికా వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన మొద‌టి టెస్టులో వెస్టిండీస్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ఇన్నింగ్స్ 141 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. ఓడిపోవ‌డం సంగ‌తి ప‌క్క‌న బెడితే ఏ విండీస్ బ్యాట‌ర్ కూడా క‌నీసం క్రీజులో కుదురుకునే ప్ర‌య‌త్న‌మే చేయ‌లేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క విండీస్ ఆట‌గాడు కూడా అర్థ‌శ‌త‌కాన్ని అందుకోలేక‌పోవ‌డంతో ఆ జ‌ట్టుపై విమ‌ర్శ‌ల జ‌డివాన మొద‌లైంది. ఈ క్ర‌మంలో జూలై 20 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో ప‌రువు నిలుపుకోవాల‌నే ల‌క్ష్యంతో విండీస్ బ‌రిలోకి దిగుతోంది.

రెండో టెస్టు కోసం 13 మందితో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించి విండీస్ క్రికెట్ బోర్డు. మ‌రో యంగ్ ఆట‌గాడికి అవ‌కాశం ఇచ్చింది. ఈ మ్యాచ్‌తో ఆల్‌రౌండ‌ర్ కెవిన్ సింక్లెయిర్(Kevin Sinclair) టెస్టుల్లో అరంగ్రేటం చేయ‌నున్నాడు. తొలి మ్యాచ్‌లో ఘోరంగా విఫ‌ల‌మైన రేమన్ రీఫర్‌(Raymon Reifer) స్థానంలో అత‌డు ఆడ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ మార్పు మిన‌హా తొలి టెస్టు ఆడిన జ‌ట్టుతోనే వెస్టిండీస్ ఆడ‌నుంది. కాగా.. ఈ మ్యాచ్‌ భారత్‌-విండీస్ జ‌ట్ల మధ్య వందో టెస్టు మ్యాచ్‌ కావడం విశేషం.

Commonwealth Games 2026 : మా వ‌ల్ల కాదు బాబోయ్‌.. చేతులెత్తేసిన ఆస్ట్రేలియా.. సందిగ్థంలో కామన్‌వెల్త్ గేమ్స్ 2026

స్పిన్‌ ఆల్‌రౌండ‌ర్ అయిన సింక్లెయిర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు వ‌న్డేలు, ఆరు టీ20లు ఆడాడు. వ‌న్డేల్లో 11, టీ 20ల్లో నాలుగు వికెట్లు తీశాడు. 18 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సింక్లెయిర్ 54 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 756 ప‌రుగులు చేశాడు.

భారత్‌తో రెండో టెస్టుకు వెస్టిండీస్ జట్టు

క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్‌), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్‌), అలిక్ అథానాజ్, టగ్ నరైన్ చందర్‌పాల్, రహ్కీమ్ కార్న్‌వాల్, జాషువా డా సిల్వా (వికెట్ కీప‌ర్‌), షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెక్‌కెంజీ, కెవిన్ సింక్లెయిర్, కెమర్ రోచ్, జోమెల్ రోచ్.

Babar Azam : అయ్యో.. ఆజాము..! సెంచ‌రీ ఎక్క‌డ‌.. ఇంకో 87 ప‌రుగులు చేసుంటేనా..?

ట్రెండింగ్ వార్తలు