YS Sharmila: ఆక్రందన, ఆవేదన, ఆందోళన.. రోజులు దగ్గరపడ్డాయి: వైఎస్ షర్మిల కామెంట్స్

న్యాయం అడిగిన రైతులకు బేడీలు వేస్తున్న నియంత పాలనకు రోజులు దగ్గరపడ్డాయని షర్మిల హెచ్చరించారు.

YS Sharmila – Farmers: తెలంగాణ (Telangana) ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. దొర పాలనలో న్యాయమడిగిన అన్నదాతకు సంకెళ్లు తప్పట్లేవని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) పోలీసులు రైతులకు సంకెళ్లు వేయడం పట్ల ఆమె స్పందించారు.

” ఆప్ కి బార్ కిసాన్ సర్కార్ అంటే ఇదేనా దొర గారు? నమ్ముకున్న భూమిని ఇచ్చేది లేదంటే బేడీలు వేయడమా మీరిచ్చే బరోసా?మీ బందిపోట్లను ప్రశ్నిస్తే రైతు అని చూడకుండా జైలుకు పంపడమేనా మీ నినాదం? మద్దతు ధర అడిగితే సంకెళ్లు. పంట కొనండని అడిగితే సంకెళ్లు.

భూములు పోయాయని అడిగితే సంకెళ్లు. భూములు ఇవ్వం అని చెప్పినా సంకెళ్లు. ఆక్రందన, ఆవేదన, ఆందోళన ఏది చూపినా రైతుకు దొర ఇచ్చే గిఫ్ట్ సంకెళ్లు. కిసాన్ భరోసా అని, వచ్చేది రైతు ప్రభుత్వమని, చెప్పుకొనేందుకు సిగ్గుపడు దొర సిగ్గుపడు. మీది బరోసానిచ్చే సర్కార్ కాదు.. రైతుకు బేడీలు వేసే సర్కార్.. రైతును బర్బాత్ చేసే సర్కార్.

రారాజును తీవ్రవాదిగా చూసే సర్కార్. రైతులను ఉగ్రవాదుల్లా చిత్రీకరించి సంకెళ్లు వేసిన కేసీఆర్ ఒక తాలిబాన్. అన్నం పెట్టే రైతన్నకు బేడీలు వేసిన కనికరం లేని కసాయి ఈ కేసీఆర్. దేశ చరిత్రలో రైతులను 3 సార్లు జైలుకి పంపిన చరిత్ర నీదే దొర. భూములు పోతున్నాయి మహాప్రభో అని నిరసన తెలిపితే అరెస్టులు చేయిస్తవా?

ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ అన్యాయని అడిగితే జైల్లో పెట్టిస్తవా? అరెస్ట్ చేయాల్సింది రైతులను కాదు. భూములు మింగే దొర కేసీఆర్ ను. బీఆర్ఎస్ దొంగలకు అనువుగా ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చిన కేసీఆర్ ను జైలుకు పంపాలి. న్యాయం అడిగిన రైతులకు బేడీలు వేస్తున్న నీ నియంత పాలనకు రోజులు దగ్గరపడ్డాయి. వచ్చే ఎన్నికల్లో ఆ సంకెళ్లు నీకే వేసేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ గారు ” అని షర్మిల ట్వీట్ చేశారు.


Congress: రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కేసీఆర్ సన్నిహితుడు శ్రీహరి రావు.. టీపీసీసీ అధ్యక్షుడు ఏమన్నారంటే?

ట్రెండింగ్ వార్తలు