YS Sharmila : టీఎస్పీఎస్సీ.. కేసీఆర్, కేటీఆర్ జేబు సంస్థ.. ఉద్యోగాలు అమ్ముకోవడమే తండ్రీకొడుకుల టార్గెట్ : వైఎస్ షర్మిల

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే యువత టీఎస్పీఎస్పీపై విశ్వసనీయత కోల్పోయిందన్నారు.

YS Sharmila

YS Sharmila Criticized : కేసీఆర్, కేటీఆర్ పై ట్విటర్ వేదికగా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.  టీఎస్పీఎస్సీ.. కేసీఆర్, కేటీఆర్ జేబు సంస్థ అని మరోసారి తేలిపోయిందని అన్నారు. అయినవాళ్లకు పదవులు కట్టబెట్టి, కొలువులు అమ్ముకోవడమే తండ్రీకొడుకుల టార్గెట్ అని కేసీఆర్, కేటీఆర్ ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీ చట్టబద్ధ సంస్థ అని చెప్పే చిన్న దొర కేటీఆర్.. చట్టానికి విరుద్ధంగా పదవులు ఎందుకు కట్టబెట్టినట్లని ప్రశ్నించారు. ఈ మేరకు వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

నిరుద్యోగుల ప్రాణాలు పోతున్నా.. అర్హత, సామర్థ్యం లేని వ్యక్తులను సభ్యులుగా ఎందుకు నియమించినట్లని నిలదీశారు. రెండు నెలలుగా దర్యాప్తు పేరుతో ఊగిసలాడుతున్న సిట్.. సభ్యుల నియామకం అక్రమమని హైకోర్టు చెప్పే దాకా ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. దొంగలకే తాళాలు ఇచ్చినట్లు మళ్లీ కొలువులు అమ్ముకోవడమే కేటీఆర్, కేసీఆర్ లక్ష్యమని ఆరోపించారు.

Rajasthan : ఆస్పత్రిలో వీల్ చైర్ లేక.. గాయపడిన కుమారుడిని స్కూటర్ పై మూడో అంతస్తుకు తీసుకెళ్లిన తండ్రి

అందుకే సీబీఐ దర్యాప్తు కోరకుండా సిట్ తో అంతా సెట్ చేస్తోందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ ను విచారిస్తేనే అసలు నిజాలు బయటపడతాయని తెలిపారు. ప్రశ్నాపత్రాల కుంభకోణంలో ఇప్పటి వరకు అసలు దొంగలను పట్టుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఇది చాలదు అన్నట్లుగా దొర గారి అనుయాయులకు దరఖాస్తులు లేకుండా పదవులు కట్టబెట్టి, ఉన్న ఉద్యోగాలు మళ్లీ అంగట్లో పెడుతున్నారని ఆరోపించారు.

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే యువత టీఎస్పీఎస్పీపై విశ్వసనీయత కోల్పోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంపైనా విశ్వాసం లేదన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా దొర గారికి దున్నపోతు మీద వానపడ్డట్టే ఉందని కేసీఆర్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

MLA Grandhi srinivas : సత్యదేవుని సాక్షిగా పవన్ పచ్చి అబద్దాలాడుతున్నారు : వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి

ఇకనైనా హైకోర్టు సూచనల మేరకు టీఎస్పీఎస్సీని పూర్తిగా పునరుద్ధరించి, చట్ట ప్రకారం సభ్యులను కేటాయించాలని వైఎస్ఆర్ టీపీ డిమాండ్ చేస్తోందన్నారు. కేసీఆర్, కేటీఆర్ యువతకు క్షమాపణ చెప్పి, బిశ్వాల్ కమిటీ సూచించిన లక్షా 91 వేల ఉద్యోగాలకు ఏకకాలంలో నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగుల ప్రాణాలను, భవిష్యత్తును కాపాడాలని వైఎస్ఆర్ టీపీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు