Rajasthan : ఆస్పత్రిలో వీల్ చైర్ లేక.. గాయపడిన కుమారుడిని స్కూటర్ పై మూడో అంతస్తుకు తీసుకెళ్లిన తండ్రి

వైద్య సిబ్బంది కుమారుడి కాలికి కట్టుకట్టిన తర్వాత తిరిగి స్కూటర్ పై కిందకు తీసుకెళ్లేందుకు మనోజ్ జైన్ ప్రయత్నించాడు. అయితే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది మనోజ్ జైన్ ను అడ్డుకుని స్కూటర్ కీ తీసుకున్నారు.

Rajasthan

Kota Govt Hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో వీల్ చైర్ లేకపోవడంతో ఓ వ్యక్తి గాయపడిన కుమారుడిని స్కూటర్ పై ఆస్పత్రిలోని మూడో అంతస్తుకు తీసుకెళ్లాడు. ఈ సంఘటన రాజస్థాన్ లోని కోటాలో చోటు చేసుకుంది. మనోజ్ జైన్ అనే న్యాయవాది కుమారుడి కాలికి గాయం అయింది. చికిత్స కోసం గురువారం కోటాలోని ప్రభుత్వ ఆస్పత్రికి కుమారుడిని తీసుకెళ్లాడు. అయితే ఆర్థోపెడిక్ వార్డు ఆస్పత్రి మూడో అంతస్తులో ఉంది.

కుమారుడిని మూడో అంతస్తుకు తీసుకెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బందిని వీల్ చైర్ కోరాడు. అయితే ఆస్పత్రి సిబ్బంది వీల్ చైర్ లేదని చెప్పారు. దీంతో అతను ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడిని వెనుక కూర్చోబెట్టుకుని లిఫ్ట్ వద్దకు చేరుకున్నాడు. స్కూటర్ తో సహా లిఫ్ట్ లోకి ఎక్కి మూడో అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి స్కూటర్ ను నడుపుతూ ఆర్థోపెడిక్ వార్డుకు కూమారుడిని తీసుకెళ్లాడు.

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు చెక్.. స్మార్ట్ సిగ్నల్స్ వచ్చేస్తున్నాయ్..

వైద్య సిబ్బంది కుమారుడి కాలికి కట్టుకట్టిన తర్వాత తిరిగి స్కూటర్ పై కిందకు తీసుకెళ్లేందుకు మనోజ్ జైన్ ప్రయత్నించాడు. అయితే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది మనోజ్ జైన్ ను అడ్డుకుని స్కూటర్ కీ తీసుకున్నారు. దీనిపై మనోజ్ జైన్ తీవ్ర అభ్యంతరం తెలిపాడు. అస్పత్రిలో వీల్ చైర్లు లేకపోవడంతో సిబ్బంది అనుమతితో గాయపడిన కుమారుడిని స్కూటర్ పై మూడు అంతస్తుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆస్పత్రిలో మౌలిక వసతులు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ఆస్పత్రిలోని అవుట్ పోస్టు వద్ద ఉన్న పోలీసులకు ఈ వాగ్వాదం విషయం తెలిసింది. దీంతో వారు వెంటనే మూడో అంతస్తుకు చేరుకున్నారు. న్యాయవాది మనోజ్ జైన్ చేసిన పనిని పోలీసులు కూడా సమర్థించారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పి రాజీ కుదిర్చారు. వీల్ చైర్లను అందుబాటులో ఉంచుతామని వైద్య అధికారులు హామీ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు