Stroke Risk : పక్షవాతం ముప్పుకు అధిక బరువు, రక్తపోటు అతిపెద్ద కారణాలా ?

పక్షవాతానికి ప్రధాన కారణాలుగా రక్తపోటు, అధిక బరువును చెప్పవచ్చు. రక్తపోటు నియంత్రణలో లేకుంటే పక్షవాతం ముప్పు పెరుగుతుంది. సాధారణంగా రక్తపోటు 120/80లోపు ఉండేలా చూసుకోవాలి.

Stroke Risk : పక్షవాతం మనిషిని ఉన్నట్టుండి కుప్ప కూలేలా చేస్తుంది. చాలా మందిలో ఆరోగ్యానికి సంబంధించిన సరైన అవగాహన లేకపోవటం వల్ల పక్షవాతం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడటం, రక్తనాళాల లోపలి మార్గం సన్నబడటం మూలంగా పక్షవాతం వస్తుంది.

శరీరంలోని అవయవాలన్నింటిని నియంత్రించేది మెదడు. మెదడుకు నిరంతరం రక్త సరఫరా సవ్యంగా జరిగితే దాని పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఏమాత్రం రక్త సరఫరా సక్రమంగా లేకపోయిన మెదడు కణాలు మరణిస్తాయి.

దీంతో మెదడు క్రమేపి దెబ్బతినటం ప్రారంభమౌతుంది. సాధారణంగా వయస్సు పెరుగుతున్న వారిలో పక్షవాతం ముప్పు అధికంగా ఉంటుంది. పక్షవాతానికి దారి తీసే పరిస్ధితులను ముందుగా అంచనా వేయటం ద్వారా రాకుండా నియంత్రించుకోవచ్చు.

పక్షవాతానికి ప్రధాన కారణాలుగా రక్తపోటు, అధిక బరువును చెప్పవచ్చు. రక్తపోటు నియంత్రణలో లేకుంటే పక్షవాతం ముప్పు పెరుగుతుంది. సాధారణంగా రక్తపోటు 120/80లోపు ఉండేలా చూసుకోవాలి.

అలా కాకుండా అంతకన్నా మించితే మాత్రం పక్షవాతం ముప్పు పెరుగుతుందని అంచనా వేయవచ్చు. తీసుకునే ఆహారంతోపాటు, రోజువారి వ్యాయామాల ద్వారా రక్తపోటు ముప్పును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అధిక బరువు ఉన్నవారు పక్షవాతానికి గురయ్యే ప్రమాదం అధికమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు మధుమేహం ఉంటే ఈ ముప్పు మరింత ఎక్కువ. బరువును అదుపులో ఉంచుకోవటం ద్వారా పక్షవాతం ముప్పును అదిగమించవచ్చు. తీసుకునే కేలరీల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

పక్షవాతం రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు ;

రోజువారిగా తీసుకునే ఉప్పవాడకాన్ని తగ్గించాలి. అదే సమయంలో రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. అయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. రోజుకు 30 నిమిషాల సమయంలో వ్యాయామానికి కేటాయించాలి. మద్యం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. మధుమేహులు రక్తంలో గ్లూకోజు స్ధాయిలు నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. రక్తపోటు, మధుమేహం సమస్యలతో బాధపడుతుంటే వైద్యుల సలహాలు, సూచనలు పాటించటం మంచిది.

 

 

ట్రెండింగ్ వార్తలు