Forgetfulness : మతిమరుపును పోగొట్టే ఆహారాలు ఇవే? వీటిని రోజువారిగా తీసుకుంటే…

బ్రెయిన్ బాగా పనిచేయాలంటే ఆక్సీజన్ అవసరం. ఒత్తిడిని తగ్గించి ఆక్సీజన్‌ని పెంచే బ్రీథింగ్ ఎక్సర్‌సైజెస్ చేయడం మంచిది. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఎరుపు రంగు పండ్లు, పుచ్చకాయలు, టమాటాలు తీసుకోవడం మంచిది. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.

Are these foods that cure forgetfulness? If you take these...

Forgetfulness : మతిమరు అనేది ఎక్కువగా వయసు పైబడుతున్న వారిలో కనిపించే వ్యాధి. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం దీని ప్రధాన లక్షణం. కొన్ని క్షణాల క్రితమే తమ చేతిలోని వస్తువును ఎక్కడ పెట్టారో కూడా గుర్తు రాని పరిస్థితి. చాలా మంది వాళ్ళ బర్త్‌డే, ఇంపార్టెంట్ అకేషన్ డేట్స్ మర్చిపోతుంటారు. మతిమరుపుకు , ఒత్తిడికీ అవినాభావ సంబంధముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మతిమరుపు ఏ వయసులోనైన రావచ్చని నిపుణులు అంటున్నారు ఇలాంటి విషయాలు. అయితే మతిమరుపును దూరం చేసుకునేందుకు రోజువారిగా కొన్ని ఆహారాల్లో మార్పులు చేయటం వల్ల మంచి ఫ్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సమతుల్య ఆహారం తీసుకుంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అలాంటి ఆహారాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. నట్స్ ; నట్స్ సూపర్ ఫుడ్స్ అని చెప్పొచ్చు. వీటిలో శరీరంతో పాటు బ్రెయిన్‌కి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. రెగ్యులర్‌గా వీటిని  తింటే  సమస్య నుంచి దూరమవ్వొచ్చు. ముఖ్యంగా వాల్‌నట్స్, బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు తినడం చాలా మంచిది. మెదడుకు మంచి ఆహారంగా వాల్ నట్స్ ను చెప్పవచ్చు. వాల్ నట్స్ లోని ఫోలిఫినాల్స్ న్యూరాన్స్ మరియు బ్రెయిన్స్ మద్య కమ్యూనికేషన్ అభివృద్ధి చేస్తుంది . ఒక గుప్పెడు వాల్ నట్స్ తినడం వల్ల మెమరీని పవర్ ను మెరుగుపడుతుంది.

READ ALSO : Blood Sugar And Cholesterol : రక్తంలో షుగర్ లెవల్స్ , కొలెస్ట్రాల్ తగ్గాలంటే వీటిని తీసుకోండి !

2. నెయ్యి, ఆలీవ్ ఆయిల్ ; రోజువారిగా ఆహారాల్లో అనేక రకాల అయిల్స్ వాడుతుంటాం. వాటికి బదులుగా నెయ్యి, ఆయిల్ వాడడం వల్ల కూడా జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇలా తీసుకోవటం వల్ల మెదడు చురుకుగా మారటంతోపాటు మతిమరుపును తగ్గించుకోవచ్చు.

3. చాక్లెట్: మెదడుకు రక్త ప్రవాహం మెరుగుపరచడం కోసం మిల్క్ చాక్లెట్ కంటే, డార్క్ చాక్లెట్ ఎక్కువగా సహాయపడుతుంది. మెదడు చురుగ్గా పనిచేయాలంటే డార్క్ చాక్లెట్ తీసుకోవటం మంచిది.

4. కూరగాయలు, పండ్లు ; బ్రెయిన్ హెల్త్‌కి తాజా పండ్లు, కూరగాయాలు చాలా దోహదం చేస్తాయి. అలాంటి వాటిలో కాయధాన్యాలు, బీన్స్, పనీర్, పప్పు, జీలకర్ర, నల్ల మిరియాలు బ్రెయిన్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవటం మంచిది.

5. యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్; బ్రెయిన్ బాగా పనిచేయాలంటే ఆక్సీజన్ అవసరం. ఒత్తిడిని తగ్గించి ఆక్సీజన్‌ని పెంచే బ్రీథింగ్ ఎక్సర్‌సైజెస్ చేయడం మంచిది. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఎరుపు రంగు పండ్లు, పుచ్చకాయలు, టమాటాలు తీసుకోవడం మంచిది. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.

6. హెర్బల్ టీ ; హెర్బల్ టీలు తాగడం వల్ల కూడా మన బ్రెయిన్ హైడ్రేట్ అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇందులో హింగ్, హల్దీ, అజ్వైన్, తులసి టీలు ఉన్నాయి. వీటిని రోజువారిగా పరిమిత మోతాదులో తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.

7. సరిపడినంత నిద్ర; మంచి నిద్ర కూడా మెదడు బాగా పనిచేసేలా చేస్తుంది. కాబట్టి, కచ్చితంగా ప్రతిరోజూ మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలి. రోజుకు 7నుండి 8 గంటలు విశ్రాంతి అవసరం. దీంతో బ్రెయిన్ పవర్‌ మెరుగవుతుంది.

READ ALSO : మీ నిద్రను పాడు చేస్తున్న అలవాట్లు ఇవే!

8. గుడ్డు: గుడ్డు పుష్కలమైన న్యూట్రీషియన్ ఆహారంగా నిపుణులు సూచిస్తున్నారు. ఇది బ్రెయిన్ పవర్ ను పెంపొందించడంలో బాగా సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది. ఇందులోని పోషకాలు బ్రెయిన్ సెల్స్ కు హెచ్చరికలను పంపటంలో సహాయకారిగా పనిచేస్తాయి.

9. చేపలు: చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చేపలు మెదడును చురుకుగా ఉంచడంలో బాగా ఉపకరిస్తాయి. వీటిని రోజువారి డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్రెయిన్ అభివృద్ధి చెందుతుంది. మతిమరుపు తగ్గుతుంది.

 

 

ట్రెండింగ్ వార్తలు