Carissa Carandas : చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు ఐరన్ లోపాన్ని నివారించే వాక్కాయలు!

జీర్ణాశయం పనితీరు మెరుగుపడాలంటే నాలుగు కాయల్ని ఉప్పుతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మలబద్ధకం తగ్గిపోతుంది. మధుమేహులకు వాక్కాయలు మేలు చేస్తాయి.

Eggplants that increase immunity and prevent iron deficiency in winter!

Carissa Carandas : చలికాలంలో అనేక వైరస్ ల తో వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ ముప్పు అధికంగా ఉంటుంది. అలాంటి వారు ఈ సమయంలో వ్యాధినిరోధక శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

ఇందుకోసం వాక్కాయలు బాగా ఉపయోగపడతాయి. పులుపు, తీపి రుచితో ఉండే వాక్కాయలను నేరుగా తినవచ్చు. అలా కాకుండా రోటిపచ్చడిగా లేదంటే, పప్పులోను వేసుకుని తీసుకోవచ్చు. వాక్కాయల్లో పోషకాలు మెండుగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

వాక్కాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది. శరీరంలో కొత్తకణజాలం అభివృద్ధికి తోడ్పడుతుంది. గుండె సంబంధిత రోగాలను దరిచేరకుండా చేయటంతోపాటు, గుండె పనితీరును మెరుగుపరచటంలో కీలకపాత్ర పోషిస్తాయి.

రక్తహీనతతో బాధపడేవారికి వాక్కాయలు బాగా ఉపకరిస్తాయి. వాక్కాయల్లో ఐరన్ అధికమోతాదులో ఉంటుంది. రక్తహీనతతో బాధపడే గర్భిణులూ తీసుకుంటే ఐరన్ లోపం తొలగిపోతుంది. రక్తంలో వ్యార్ధాలు బయటకు వెళ్లిపోతాయి.

జీర్ణాశయం పనితీరు మెరుగుపడాలంటే నాలుగు కాయల్ని ఉప్పుతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మలబద్ధకం తగ్గిపోతుంది. మధుమేహులకు వాక్కాయలు మేలు చేస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలు అదుపులో ఉంచటంలో సహయాపడతాయి.

చిగుళ్ల నుండి రక్తం కారటం, దంత సమస్యలతో బాధపడుతున్న వారు వాక్కాయలను నమిలి తినటం వల్ల దంతాలు శుభ్రపడతాయి. చిగుళ్ల నుండి రక్తం కారటం, పొక్కులు రావటం వంటివి తగ్గుతాయి.

నీర‌సం, అల‌స‌ట, ఒత్తిడి, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లతో సతమతమౌతున్న వారు, వాక్కాయ జ్యూస్ తాగడం వ‌ల్ల శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా కూడా ఉంటారు. గ్యాస్, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు ప‌రార్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు